డైరెక్టర్ బి.గోపాల్ తరవాత నందమూరి బాలకృష్ణలోని ఫైర్‌ను ఆ స్థాయిలో చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ అనగానే అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేస్తారు. దీనికి కారణం గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు. ‘సింహా’ సినిమా ద్వారా కొత్త బాలకృష్ణను చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నారు బోయపాటి శ్రీను. ఆ తరవాత ‘లెజెండ్’ సినిమాతో తమ కాంబో సూపర్ హిట్ అని నిరూపించారు. అందుకే, ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తోన్న మూడో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘రాజు గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి.. రాజు గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా’’ అంటూ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులను ఊపేసింది. అంతేకాకుండా న్యూ లుక్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా టైటిల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘మోనార్క్’ అనే టైటిల్ చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి BB3 అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేసింది. ‘మీరు ఎప్పుటి నుంచో ఎదురు చూస్తోన్న #BB3 అప్‌డేట్ వచ్చేస్తుంది’ అని ప్రకటించింది. దీంతో నందమూరి అభిమానుల్లో కొత్త ఊపు వచ్చింది. సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇంకా టైటిల్ కూడా ప్రకటించలేదు కాబట్టి.. విడుదల తేదీతో కూడిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తారని సమాచారం. మే 28న విడుదల తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కానీ, విడుదల తేదీ మే 12 లేదంటే 13న ఫిక్స్ చేయాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు. అంటే, ‘ఆచార్య’కు పోటీగా విడుదల చేయాలంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3teQ74c
No comments:
Post a Comment