స్టార్ హీరోయిన్ ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తాను కమిటైన సినిమాల షూటింగ్స్ పూర్తిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తొలి వెబ్ సిరీస్ '' విడుదలకు సిద్ధమైంది. హారర్ నేపథ్యంలో ఓ డిఫరెంట్ కథతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఒక నిమిషం 19 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. హారర్ సన్నివేశాలను చాలా డిఫరెంట్ వే లో షూట్ చేశారని తెలుస్తోంది. లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన చేసి ఓ ఇంటికి వెళ్లిన కాజల్ బృందం ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? నిజంగా వాళ్లకు దెయ్యం కనపడిందా? ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అనే విషయాలను తెలియపర్చుతూ ట్రైలర్ విడుదల చేశారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ థ్రిల్లింగ్ కథగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ మూవీలో టీవీ రిపోర్టర్‌గా కాజల్ కనిపించనుంది. టీఆర్పీ, సెన్సేషనలిజం కోసం దెయ్యాలను లైవ్‌లో కవర్ చేసి చూపిస్తామని కాజల్ చేసిన ప్రయత్నమే ఈ 'లైవ్ టెలికాస్ట్'. ఈ వెబ్ సిరీస్‌లో వైభవ్, ఆనంది కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 12వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MkX6Ih
No comments:
Post a Comment