మెగా అభిమానాలోకం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ క్షణం ఈ జనవరిలోనే ఉంది.. అది కూడా మరో రెండు రోజుల్లోనే అంటూ ఫ్యాన్స్‌ని హూషారెత్తించారు డైరెక్టర్ . రిలీజ్ డేట్, అప్‌డేట్ ఇచ్చి పండగ వాతావరణం తీసుకొచ్చారు. టీజర్ ఎప్పుడు వచ్చేది రేపు ఉదయం 10 గంటలకు తెలుస్తుందని చెబుతూ మెగా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిరంజీవి.. తాజాగా ఆచార్య టీజర్ రిలీజ్ డేట్, టైమ్ అనౌన్స్ చేసిన కొరటాల శివకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. డియర్ చిరంజీవి సర్.. జనవరి 29 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ధర్మస్థలి తలుపులు తెరుచుకుంటున్నాయంటూ టీజర్ అప్‌డేట్‌తో కూడిన చిన్న వీడియో షేర్ చేశారు కొరటాల శివ. ఇది చూసిన చిరంజీవి.. చేసిన ప్రామిస్ నిలబెట్టుకున్నందుకు థాంక్యూ కొరటాల అంటూ కామెంట్ చేశారు. అయితే కొరటాలతో చిరంజీవి చేసిన డిస్కషన్ ఫలించడం, అంతేగాక ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించడం మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కూడా భాగం పంచుకుంటున్నారు. చెర్రీ `సిద్ధ` పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఆయన ఉండటం విశేషం. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. మే 9న 'ఆచార్య'ను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LYc6ff
No comments:
Post a Comment