మాస్ మహారాజా వరుస సినిమాలను ట్రాక్ ఎక్కించేస్తున్నారు. మధ్యలో హిట్స్ లేనప్పుడు కూడా ఆయన సినిమాలు చేయడంలో స్పీడు మాత్రం తగ్గించలేదు. క్రాక్ బ్లాక్ బస్టర్ కావడం కూడా రవితేజకు మళ్లీ కలిసొచ్చింది. రీసెంట్‌గా ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన రవితేజ.. రామారావు అనే సినిమాతో పాటు మరో సినిమాకు ఓకే చేశాడు. ఆ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఈ విషయం అధికారికంగా ప్రకటన కూడా చేశారు. రవితేజ ఇప్పుడు చేస్తున్న రామారావు సినిమాతో పాటు త్రినాథరావు నక్కిన సినిమాను కూడా స్టార్ట్ చేసేశాడు. విజయ దశమి సందర్భంగా రవితేజ తన అభిమానులకు, ప్రేక్షకులకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అదే తన 68వ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. ఆ సినిమాయే ‘ధమాకా’. డబుల్ ఇంపాక్ట్ పక్కా అనే క్యాప్షన్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఎంటైర్‌టైనింగ్ పంథాలో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాలో అదే ఎంటర్‌టైనింగ్ వేలో, రవితేజ ఎనర్జీకి తగినట్లు రూపొందిస్తున్నాడు. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై సినిమా నిర్మితమవుతోంది. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు. భీమ్స సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవితేజ 69వ చిత్రమిది. ఖిలాడి సినిమాలో డ్యూయెల్ రోల్ చేసిన రవితేజ.. ఇప్పుడు ధమాకాలోనూ డ్యూయెల్ రోల్ చేస్తున్నారా? అందుకే డబుల్ ఇంపాక్ట్ అని క్యాప్షన్ పెట్టారా? అనే ఆలోచనలు వస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lJrjzL
No comments:
Post a Comment