మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. తేజు కోలుకోవాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుకున్నారు. అందరి ప్రార్థనలతో సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు. సాయిధరమ్ తేజ్ కూడా రీసెంట్‌గా తాను పూర్తిగా కోలుకుంటున్నానని తెలియజేసిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్, నాగబాబు ఇలా మెగా హీరోలందరూ సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇస్తూనే వస్తున్నారు. ఈ శుక్రవారం సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు. ఓ వైపు విజయ దశమి, మరో వైపు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు చిరంజీవి. ‘‘ఈరోజు విజయ దశమి, అంతే కాకుండా మరో స్పెషాలిటీ కూడా ఉంది. రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ ఇంటికి తిరిగి వస్తున్నాడు. తనొక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తనకిది పునర్జన్మలాంటిది. అత్త, పెద్ద మామ నుంచి నీకు హ్యాపీ బర్త్ డే తేజు’’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. మెగాస్టార్ ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో ప్రేక్షకాభిమానులు హ్యపీగా ఫీలవుతున్నారు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు రానున్న బుధవారం(అక్టోబర్ 20)న తిరిగి వస్తారట. సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినీ సెలబ్రిటీలు, ఆయన అభిమానులు విషెష్ తెలియజేస్తున్నారు. తను హాస్పిటల్‌లో ఉండగానే ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3j2i4c6
No comments:
Post a Comment