మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కొత్త సినిమాలను ఓకే చేయడంలో స్పీడు పెంచేశాడు. ఆయన స్పీడు చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలను ట్రాక్ ఎక్కించడంలో, మరో టాలీవుడ్ స్టార్ కథానాయకుడు ప్రభాస్‌తో పోటీ పడుతున్నాడా? అనిపిస్తుంది. ఎందుకంటే.. విజయదశమికి చరణ్, తన 16వ సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కచ్చితంగా పాన్ ఇండియా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు చెర్రీ.. మరో సినిమాను కూడా ట్రాక్ ఎక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ.. రామ్ చరణ్ 17వ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ కె.జి.యఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడని టాక్. రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ, ఆర్ఆర్ఆర్ సినిమాలను నిర్మించిన డి.వి.వి.దానయ్య ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నాడు. విజయ దశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో నిర్మాత డి.వి.వి.దానయ్య, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌లకు విందు బోజనం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ తెలిపారు. ‘‘ఈరోజు ఓ లెజెండ్‌ను కలుసుకున్నాను. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన రామ్‌చరణ్‌గారికి ధన్యవాదాలు. చిరంజీవిగారిని కలవాలని నా చినప్పటి కోరి నేటితో తీరింది’’ అని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. అలాగే చిరంజీవిని ఆయన ఇంట్లో కలవడం, ఆయనతో కలిసి డిన్నర్ చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్‌తో సలార్ సినిమాను చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత రామ్‌చరణ్ మూవీ ఉండే అవకాశం ఉందని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కె.జి.యఫ్ ఛాప్టర్ 2 వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mV6bG9
No comments:
Post a Comment