‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రివ్యూ: రొమాన్స్ రుచి చూడాల్సిందే!

ప్రేమ కథల్లో కొత్తదనం ఏముంటుంది.. అదే అమ్మాయి.. అదే అబ్బాయి.. అదే ప్రేమ.. అదే గొడవలు.. కలవడాలు విడిపోవడాలు.. వీటన్నింటి నడుమ సాగే ఎమోషన్స్ ఎంత గొప్పగా చూపిస్తే అంది అంత గొప్ప ప్రేమకథ అవుతుంది. ప్రేమ-పెళ్లి అనేవి రెండక్షరాల పదాలే కావచ్చు.. ఆస్వాదించడాన్ని బట్టే అందులోని రుచి తెలుస్తుంది. ఈ లవ్ టేస్ట్‌ని సమపాళ్లలో వడ్డించి.. విసుగు లేకుండా వీక్షించేట్టు చేయడంలోనే దర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనే కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది.. నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న తెలెత్తుతూనే ఉంటుంది. పెళ్లి తరువాత సక్సెస్ ఫుల్ కాపురానికి కావాల్సిన మోస్ట్ ఎలిజిబుల్ క్వాలిటీ ఏంటంటే.. అది ‘సర్దుకుపోవడమే’ అని చెప్తుంటారు చాలామంది. కానీ ఆ సర్దుకుపోవడంలో ఎంత కోల్పోతున్నాం.. పెళ్లి అనే బంధం నిలబడాలంటే మోస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి? అన్నదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కథ. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ప్రేమ కథల్లో మంచి సోల్ ఉంటుంది. చాలా డెప్త్‌గా కథలో ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ రాస్తారు. అది అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ.. ఆ సోల్ పట్టుకోగలిగితే మాత్రం మనసుల్ని తాకే మధుర జ్ఞాపకాలు కళ్లముందున్నట్టుగానే అనిపిస్తుంటాయి ప్రేమికులకు.. ఎక్కడో ఒకచోట కథకి కనెక్ట్ అయిపోతుంటారు. బొమ్మరిల్లు, ఆరెంజ్ వంటి సినిమాల్లో అదే మార్క్ చూపించిన భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ద్వారా లవ్ అండ్ రిలేషన్ షిప్‌లో ఉండే ఎమోషన్స్‌కి కళ్లకి కట్టి.. ఎలిజిబిలిటీ అనేది పెళ్లికి మాత్రమే కాదు.. కాపురానికి కావాలని సందేశాత్మకంగా చూపించారు. పెళ్లి అంటే సర్దుకుపోవడం కాదు.. అర్ధం చేసుకుని జీవించడం అని చెప్తూనే అందులోని అందమైన రొమాన్స్‌ అద్భుతంగా చూపించారు. పెళ్లి లైఫ్‌‌లో ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి?? భార్యని బాగా చూసుకోవడం.. మంచి ఇళ్లు.. పెద్ద ఫ్యామిలీ.. పిల్లలు ఆస్తులు.. ఇంతకు మించి ఏమీ లేదా? సర్దుకుపోవడంలో ఎంత కోల్పోతున్నాం అనే దర్శకుడి కోపంలో నుంచి పుట్టుకొచ్చిన కన్ఫ్యూజన్ కథే ఇది. పెళ్లిపై పిచ్చ క్లారిటీతో ఉన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ హర్ష (అఖిల్) అమెరికాలో స్థిరపడతాడు. కాబోయే భార్య కోసం మంచి ఇల్లుతో పాటు అన్నీ సమకూర్చుంటాడు. 20 పెళ్లి సంబంధాలు రెడీ పెట్టుకుని అందులో ఎవర్నొకర్ని 20 రోజులలోపే పెళ్లి చేసుకుని తిరిగి అమెరికా వెళ్లిపోవాలనుకుని పెళ్లి కోసం ఇండియాకి వస్తాడు. ఒక్కో పెళ్లి సంబంధం చూస్తుండగా.. అందులో విభ (పూజా హెగ్డే) ఫొటోని చూసి ప్రేమలో పడతాడు. అయితే జాతకాలు కలవకపోవడంతో విభతో పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తారు హర్ష పేరెంట్స్. అయితే అప్పటి వరకూ పెళ్లిపై ఫుల్ క్లారిటీతో ఉన్న హర్ష.. అసలు పెళ్లితో పాటు కాపురానికి ఎలిజిబిలిటీ ఉండాలని విభ ద్వారా తెలుసుకుంటాడు.. అప్పటి నుంచే చూసే ప్రతి అమ్మాయిలోనూ విభని వెతుక్కుంటాడు. అనూహ్య పరిస్థితుల్లో విభని దూరం చూసుకుంటాడు? తిరిగి విభ-హర్షలు ఎలా కలిశారు? ప్రేమ-పెళ్లి నేపథ్యంలో ఎదురైన సంఘర్షణలు ఏంటి? పెళ్లి లైఫ్‌కి కావాల్సిన ఎలిజిబిలిటీని హర్ష ఎలా సాధించాడు అన్నదే మిగిలిన కథ. అక్కినేని వంశాభిమానుల ఆశ అఖిల్ పెద్ద హీరో అవ్వాలని.. మరీ ఏఎన్నార్ స్థాయిలో కాకపోయినా కనీసం నాగ చైతన్య మాదిరైనా ఓ హిట్ట కొడితే కలల పండుగొచ్చినట్టే అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను మూడు సినిమాలు మిస్ ఫైర్ కావడంతో ఆశలన్నీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ పైనే పెట్టుకున్నారు. అంతంత మాత్రం యాక్టింగ్‌తో నెట్టుకొస్తున్న అఖిల్‌కి వివి వినాయక్, విక్రం కె కుమార్, వెంకీ అట్లూరి లాంటి దర్శకులు అండగా నిలబడటం అటుంచితే తమ దర్శకత్వ ప్రతిభతో అఖిల్‌‌ని మరో మెట్టు ఎక్కించలేకపోయారు. సిసింద్రీ దగ్గరే ఆపేశారు. నటించాలనే కసి అఖిల్‌లో కనిపిస్తున్నా.. అతనిలోని పరిపూర్ణ నటుడ్ని బయటకు తీసుకుని రాలేకపోయారు. అక్కినేని ఫ్యామిలీకి లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు.. అయితే ఆ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మా అఖిల్ బొమ్మ హిట్టు అనే చెప్పుకునే రోజు రాలేదు. దీంతో ఆ బాధ్యతను బొమ్మరిల్లు భాస్కర్ భుజాలపై వేసుకుని ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చిత్రాన్ని రూపొందించారు. అఖిల్‌ని ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేస్తానని ప్రామిస్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్.. ఈ చిత్రంతో మాట నిలుపుకున్నారు. అఖిల్ ఫైట్స్ చేస్తున్నాడు.. డాన్స్ చేస్తున్నాడు.. రొమాంటిక్ సాంగ్‌లు చేస్తున్నాడు.. అంతాబాగానే ఉంది.. అయినప్పటికీ గత రెండున్నరేళ్లుగా సోల్ సెర్చింగ్‌లోనే ఉండిపోయాడు అఖిల్. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చిత్రంతో మంచి సోల్ కథను ఎంపిక చేసుకున్నాడు. హర్ష పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేవరకూ నిద్రపోనని శపథం చేసిన అఖిల్.. ఈ చిత్రం తరువాత కాస్త రిలాక్స్ అయితే అవ్వొచ్చు కానీ.. పూర్తి స్లీపింగ్‌లోకి వెళ్లడం కష్టమే. కాగా అఖిల్ కథను నమ్మి నిజాయితీగా చేసిన చిత్రమిది. బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ పెద్ద కూతురు పేరు.. అలాగే ఈ సినిమాలో విభా పేరు ఆయన చిన్న కూతురు పేరు. అయితే జెలినియాకి హాసిని క్యారెక్టర్ ఎలాగైతో గుర్తిండిపోయింది.. పూజా హెగ్డేకి విభావరి క్యారెక్టర్‌ అంతలా సెట్ అయ్యింది. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుని ఒకర్నొకరు బాధపెట్టుకుంటూ.. ఆ బాధని భరిస్తూ సర్దుకుపోతుంటారు. ఈ సర్దుకుపోవడంలోనే కోల్పోయేది చాలా అంటే చాలా ఉంటుంది.. భార్య భర్త అంటే పక్క పక్కన బతకడం కాదు.. దగ్గరగా బతకడం. అలా బతకడం ఎలాగో తెలిసిన అమ్మాయే విభ (పూజా హెగ్డే). స్టాండప్‌ కమెడియన్‌గా విభావరి పాత్రలో పూజా హెగ్డే నటన అందరినీ అలరిస్తుంది. ఇన్నాళ్లూ పూజా తొడల సోయగాన్ని చూపించడంతో సరిపెట్టేశారు దర్శకులు. అయితే భాస్కర్.. ఆమె థైస్ అందాలను వదలలేకపోయాడు కానీ.. ఆమె క్యారెక్టర్‌ కథలో మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిజానికి హీరో రోల్ కంటే కూడా కూడా హీరోయిన్ రోల్‌కి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఒకరకంగా హీరో క్యారెక్టర్‌ని డ్యామినేట్ చేసింది. చివర్లో వచ్చే లిప్ లాక్‌ సీన్‌లో జీవించేసింది పూజా. అయితే అఖిల్‌తో పెయిర్ అంతగా సెట్ అయినట్టుగా కనిపించదు. అంతకు ముందు మహేష్, ఎన్టీఆర్, బన్నీ లాంటి సీనియర్ల పక్కన చేయడం మూలంగానే ఏమో కానీ.. పూజా పక్కన అఖిల్ పిల్లోడిలా కనిపించాడు.. అందుకే రొమాన్స్ పెద్దగా పండినట్టుగా అనిపించలేదు. ఏ చిత్రానికైనా ముగింపే ముఖ్యం. ఇందులోనూ ఓ మంచి ముగింపు ఉన్నప్పటికీ.. అందులో బొమ్మరిల్లు ఛాయలు కనిపిస్తాయి. ప్రధాన పాత్రల్లోని లోపాల్ని ఎత్తి చూపడం.. హీరో క్లాస్ పీకి సందేశాన్ని ఇవ్వడం.. వాళ్లు మారిపోవడం.. ‘నా చేయి ఇంకా మీ చేతుల్లోనే ఉంది నాన్న’ అని బొమ్మరిల్లు క్లైమాక్స్‌ని గుర్తు చేస్తుంది. ప్రేమ కంటే రొమాన్స్ గొప్పది అని ఇచ్చిన సందేశంలో కాస్త కన్ఫ్యూజన్ కనిస్తుంది. పైగా సెంకడాఫ్‌లో హీరో హీరోయిన్లు మధ్య దాగుడుమూతలు కాస్త చిరాకు కలిగిస్తాయి. హర్ష-విభలు నేరుగా కలుసుకునే అవకాశం ఉన్నా.. దూరం దూరం పెట్టి కథను చివరి వరకూ నెట్టుకొచ్చారు. ప్లీ క్లైమాక్స్ సీన్‌లో కూడా హీరో హీరోయిన్లు చూసుకోకుండానే మాట్లాడుకోవడం ఈ దాగుడు మూతల కథ అవసరమా? అనేట్టుగా అనిపించింది. ఫస్టాఫ్ వరకూ కథ సాఫీగా సాగిపోతుంది. అయితే ఎప్పుడైతే హర్షలో పెళ్లి కన్ఫ్యూజన్ మొదలౌతుందో అక్కడ నుంచి కథలో కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. ఆరెంజ్ సినిమాలో ఉన్న కన్ఫ్యూజనే మళ్లీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. కొందరికి నచ్చినట్టుగా అనిపిస్తే.. మరికొంతమందిని కన్ఫ్యూజన్‌లోనే ఉంచేసింది. మంచి సోల్ ఉన్న కథకి స్పీడ్‌గా లేని సన్నివేశాలు మైనస్ అయ్యాయి. క్లయిమాక్స్‌ వరకు కాలక్షేపం చేసినట్టుగా అనిపిస్తాయి. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెప్తాడు.. ‘నా పరిస్థితి అరిటాకులో పోసిన రసంలా ఉంది.. ఎటు పోతుందో నాకే తెలియడం లేదు’ అని.. ఈ సినిమా సెకండాఫ్‌లో కొన్ని సీన్లు అలాగే అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో స్టాండప్ కామెడీ చేయడానికి స్టేజ్ ఎక్కిన హీరోయిన్ తాను ఏడుస్తూ అందర్నీ ఏడిపించడం లాజిక్‌గా అనిపించదు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుల కామెడీ పండింది. వెన్నెల కిషోర్ ఉన్నంతలో పర్వాలేదు. హీరోయిన్ పేరెంట్స్‌గా నటించిన మురళీ శర్మ, ప్రగతిలు ఆకట్టుకున్నారు. సిసింద్రీలో అఖిల్‌కి తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ ఆమని ఈ చిత్రంలో కూడా అఖిల్‌కి తల్లిగా నటించింది అయితే ఆమెకు పెద్దగా స్కోప్‌లేదు. రెండు మూడు సీన్‌లకే పరిమితం అయ్యింది. ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, మణిచందన, సత్య, అజయ్, అమిత్ తివారి, పోసాని, కాశీ విశ్వనాథ్ పర్వాలేదనిపించారు. రియల్ లైఫ్ కపుల్.. రాహుల్ రవీంద్రన్, చిన్మయిలు ఈ సినిమాలో సర్ ప్రైజ్ చేశారు. ఈ రియల్ లైఫ్ కపుల్స్‌కి హీరో కథ చెప్పడంతో సినిమా మొదలౌతుంది. చిన్మయి వాయిస్ సమంతని గుర్తు చేస్తుంది.. వీళ్ల క్యారెక్టర్స్‌ని కథకి లింక్ చేసిన విధానం బాగుంది. టేకింగ్ పరంగా సినిమా చాలా రిచ్‌గా అనిపిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు.. నెహరాయి సాంగ్.. వినడానికే కాదు చూడ్డానికి చాలా బాగుంది.. మార్తాంక్ కె వెంకట్ ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకూ ఓకే కానీ సెకండాఫ్‌లో నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తంగా.. ఒక అమ్మాయి, అబ్బాయి.. వారి వారి అభిప్రాయాలు హృదపూర్వకంగా కలిస్తే అది ప్రేమ.. అదే జంట నలుగురి సమక్షంలో అగ్నిసాక్షిగా కలిస్తే అది పెళ్లి.. కానీ ఆ బంధాన్ని జీవితం చివరి అంకం వరకూ లాక్కెళ్లగలిగేది మాత్రం రొమాన్స్. రొమాన్స్ అని తెలుగులో సర్చ్ చేస్తే శృంగారం అనే అర్థమే చూపిస్తుంది. కానీ.. ‘నీ కోసం నేను.. నా కోసం నువ్వు’ అనే బలమైన సందేశాన్ని అంతే బలంగా సోల్ మెట్‌కి అందించగలిగే వారది రొమాన్స్ మాత్రమే. రొమాన్స్ అంటే 10 నిమిషాల తలుపులేసుకుని ఏకాంతంగా చేసే కాపురం అనుకుంటారు చాలామంది. కానీ ఇష్టాన్ని పెదవులతో చెప్పగలిగే ఓ ముద్దు.. ప్రేమని ప్రేమగా గుండెలకు హత్తుకునే ఓ కౌగిలి.. ఇవి రెండూ తణువులని ఏకం చేసే కంటే ముందే మనసుల్ని ఏకం చెయ్యగలవు.. ‘నీకు నేను ఉన్నాను.. ఎప్పటికీ ఉంటాను’ అనే భరోసాని ఇవ్వగలవు.. అదే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’లో చూపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aIzlmd

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts