సీనియర్ హీరోయిన్ సీక్రెట్‌గా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రు కొశ్చివ్‌ని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ సినిమాలను పక్కనబెట్టి భర్తతో రొమాంటిక్ టూర్స్ వేసిన సంగతి తెలిసిందే. పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తూ ఈ జోడీ చేసిన రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. సినిమాల్లో నటించకపోయినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ జనం నోళ్ళలో నానుతూ వచ్చింది శ్రీయ. ఈ క్రమంలోనే రీసెంట్‌గా తాను తల్లినయ్యా అనే అతిపెద్ద సీక్రెట్ రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ''2020 మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా అంతా సంవత్సరం పాటు క్వారంటైన్‌లో వెళ్లిగా.. మా జీవితంలో మాత్రం ఓ అద్భుతం జరిగింది. దేవుడు మాకు ఒక ఏంజిల్ లాంటి చిన్నారిని ప్రసాదించాడు'' అని పేర్కొంది. దీంతో శ్రీయ ఇన్ని నెలలపాటు ఈ విషయం దాచిపెట్టడం పట్ల జనాలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇది సరికాదని కొందరు అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీయ దాచిపెట్టిన ఈ రహస్యంపై తాజాగా రియాక్ట్ అయింది. ఇది ఎప్పటికీ గొప్ప శుభవార్త అంటూ శ్రీయకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పిన మంచు లక్ష్మి.. ''ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడంలో నువ్వు తీసుకున్న సమయం విషయమై నిన్ను చూసి గర్వపడుతున్నా. ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం. అది అందరికీ సమయానికి చెప్పాల్సిన అవసరం లేదు'' అని తెలిపింది. 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్ళాడిన శ్రీయ.. వయస్సు పెరుగుతున్నా తరగని అందం అనిపించుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అప్పటినుంచి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తిరిగి ఇప్పుడిప్పుడే సినిమాలపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ఆమె RRR మూవీలో నటిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DESUs1
No comments:
Post a Comment