బాలీవుడ్ హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచి అందం అద్భుతమైన నాట్యంతో ఆమె ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే దక్షిణాదిన కొన్ని భాషల్లో ప్రత్యేక పాటల్లో డ్యాన్స్ చేసి ఆమె అలరించింది. ఇక ఆమె గ్లామర్‌కి ఫిదా కాని కుర్రకారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్‌గా విడుదలైన ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో ఆమె తన నటనతో ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. అయితే తాజాగా నోరా ఫతేహీకి షాక్ ఇచ్చింది. గత నెలలో బాలీవుడ్‌లో రూ.200 కోట్ల మనీ లాండరింగ్ స్కామ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు కన్హార్ సుకేశ్ చంద్రశేఖర్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్‌తో కాలర్ ఐడి స్పూఫింగ్ ద్వారా సంప్రదించాడని ఇప్పటికే తెలిపింది. ఈ కేసుకు సంబంధించి జాక్విలిన్‌కు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తాజాగా ఈ కేసుకు నోరా ఫతేహికి కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుసుకన్న ఈడీ అధికారులు ఆమెకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే మనీ లాండరింగ్‌తో పాటు బాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ కేసులో కూడా నోరా ఫతేహీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈ కేసులో అరెస్ట్ కావడంతో అది మరింత సంచలంగా మారింది. ఇక ఇప్పుడు నోరాకు మనీ లాండరింగ్, డగ్స్ కేసులో నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు.. ఆమెను విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. మరి ఈ కేసులో ఇంకెవరికి నోటీసులు వెళ్తాయో అని సినీ అభిమానులు భావిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BIsJ2S
No comments:
Post a Comment