తరం మారింది.. కమర్షియల్ సినిమాల ప్రవాహం ఎక్కువైపోయింది. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. హీరోహీరోయిన్ల రెమ్మ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా అడిగినంత ముట్టజెబుతున్నారు. ఈ క్రమంలోనే శంకర్- కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కోసం మెగా పవర్ స్టార్ భారీ రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేసినా దానికి ఓకే చెప్పి డేట్స్ తీసుకున్నారట మేకర్స్. RRR మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బడా దర్శకులు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తన బ్యానర్ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని చెప్పారట దిల్ రాజు. అయితే ఇందులో నటించేందుకు గాకు ఏకంగా 80 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట రామ్ చరణ్. అందుకు సిద్దమైన మేకర్స్ ఓకే చెప్పి ఆయన్ను రంగంలోకి దించుతున్నారట. అంతేకాదు మొత్తంగా ఈ సినిమా కోసం 250 కోట్ల మేర బడ్జెట్ కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని రూపొందించనున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ కథలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lw5Xpn
No comments:
Post a Comment