హీరో నితిన్ మంచి స్పీడు మీదున్నాడు. రంగ్ దే, చెక్ మూవీలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమాలు ఊపు తగ్గకముందే మాస్ట్రో సినిమాతో ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతుండటం విశేషం. ఈ మూవీ విడుదల కాకముందే, తన లేటెస్ట్ మూవీని అనౌన్స్ చేసేశాడు నితిన్. ఆ సినిమాయే మాచర్ల నియోజక వర్గం. తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌లో తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితారెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. రీసెంట్‌గానే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా.. ఈ సినిమాలో హీరో నితిన్ ఎలాంటి పాత్ర చేయబోతున్నాడనే దానిపై ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం మేరకు మాచర్ల నియోజక వర్గంలో నితిన్ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడట. ఫస్టాఫ్ అంతా తన పాత్ర నార్మల్‌గా ఉంటుందని, సెకండాఫ్‌లో తన పాత్ర కలెక్టర్‌గా కినిపిస్తుందని టాక్. మాచర్ల నియోజక వర్గంలో విలన్స్‌ను ఓ కలెక్టర్ ఎలా తెలివిగా ఎదుర్కొన్నాడనేది అసలు కథట. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఆ హీరోయిన్‌తో కూడా మేకర్స్ చర్చలు పూర్తి చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఓ నటుడ్ని విలన్‌గా నటింప చేస్తున్నారట. మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. మరో వైపు మాస్ట్రోలో అంధుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ హాట్‌స్టార్‌లో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nzKE80
No comments:
Post a Comment