ఈ సారి 'మా' ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ కనిపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 10న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ ప్యానల్ వివరాలు ప్రకటించిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్నికల ప్రణాళికపై కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 27) నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో తన ప్యానల్ సభ్యులతో సహా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ప్రకాష్ రాజ్, అతని టీమ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ప్రతి విషయంలో తమ టీమ్ ముందే ఉంటుందని అన్నారు. ఇవి ఎన్నికలు కాదు పోటీ మాత్రమే అని మరోసారి పేర్కొన్నారు. 'మా' ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన ఆయన.. అక్టోబర్ 3న తమ ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. ఇకపోతే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేసిన జీవితా రాజశేఖర్.. మద్దతు విషయమై కొన్ని కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ 'మా' ఎన్నికలకు పక్కా ప్రణాళిక తయారు చేశారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. చిరంజీవి గారి మద్దతు ప్రకాష్ రాజ్‌కు ఉందనడానికి తమ దగ్గర ఆధారాలు లేవని, చిరంజీవి మద్దతు విష్ణుకు కూడా ఉండొచ్చు అని అన్నారు . ఈ ఎన్నికలను తప్పుదారి పట్టించవద్దని, ఒకొరినొకరు కించపరుచుకోకుండా ఎన్నికలు సజావుగా జరగాలని ఆమె కోరారు. సెప్టెంబర్ 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్న నేపథ్యంలో.. మంచు విష్ణు రేపు (సెప్టెంబర్ 28) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్‌ల పరిశీలన ఉండనుంది. అక్టోబర్ 1,2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39Gykug
No comments:
Post a Comment