
డాన్స్ ప్రధాన భూమికగా గతంలో వచ్చిన 'స్వర్ణ కమలం' మూవీ తెలుగు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు అదే బాటలో 'నాట్యం' అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డాన్సింగ్ నేపథ్యంలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా . ఈ సినిమాతో ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల నటసింహ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో చేతుల మీదుగా మరో సాంగ్ 'పోనీ పోనీ' లిరికల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ''రేవంత్ దర్శకత్వంలో డాన్సర్ సంధ్య నటించిన నాట్యం సినిమా నుంచి ఈ పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపి రూపొందించారు. చాలా చక్కగా డాన్స్ చేశారు. చూస్తుంటే స్వర్ణ కమలం మళ్ళీ గుర్తొస్తోంది. అందమైన లొకేషన్స్‌లో ఎంతో అందంగా చిత్రీకరించారు. డాన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రాక చాలా రోజులైంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mbJDAm
No comments:
Post a Comment