కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ కుదేలైంది. గత రెండేళ్లుగా షూటింగ్స్ సరిగ్గా జరగక, థియేటర్స్ ఓపెన్ కాక ఎన్నో సమస్యలు తలెత్తాయి. అయినప్పటికీ ఎక్కడా వెనక్కితగ్గకుండా కమిటైన సినిమాలు ఫినిష్ చేశారు నటీనటులు. ఈ క్రమంలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దమైన సినిమా ''. దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో , జంటగా నటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చాలా విషయాలపై ఓపెన్ అయింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ చేసిన సంప్రదింపులు, ఆ సమయంలో ఎలా స్క్రిప్ట్ నేరేట్ చేశారు అనే విషయాలను బయటపెట్టింది. ''ఓ రోజు దేవకట్టా గారు ఫోన్ చేసి రిపబ్లిక్ సినిమా గురించి చెప్పి ఇందులో మైరా పాత్ర ఉందని చెప్పారు. ఆయన బేసిగ్గా హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్స్, దాని ప్రాధాన్యతలేంటి? అని చూస్తారు. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు కరోనా కారణంగా ఫోన్‌లోనే స్క్రిప్ట్ గంట పాటు వివరించారు. అది నచ్చి హైదరాబాద్ వచ్చి కలిసిన తర్వాత మరో ఐదారు గంటల పాటు స్క్రిప్ట్ నెరేట్ చేశారు'' అని చెప్పింది ఐశ్వర్య రాజేష్. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ప్రజా హక్కుల నేపథ్యంలో సమాజానికి ఉపయోగపడే సరికొత్త పాయింట్ ఈ సినిమాలో టచ్ చేశారని ఇప్పటివరకు విడుదలైన అప్‌డేట్స్ ద్వారా తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XPAHIK
No comments:
Post a Comment