
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో ప్రభాస్. ఆయన్ని దగ్గర నుంచి చూసిన వారెవరైనా డార్లింగ్ అనే పిలుస్తారు. అంత మంచి మనసున్న వ్యక్తి. సెట్స్‌లో తోటి నటీనటులను ఎంతో బాగా ట్రీట్ చేస్తుంటారు. ప్రత్యేకంగా ఇంటి నుంచి వివిధ రకాలైన వంటలను తయారు చేసి సహ నటులకు భోజనం పెడుతుంటారు ప్రభాస్. ఆయనతో పనిచేసిన హీరోయిన్స్ కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమా పూర్తికాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. రామాయణ గాథ ఆధారంగా ‘ఆది పురుష్’ సినిమా రూపొందనుంది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా.. లంకేశ్వరుడు రావణాసురుడి పాత్రలో ప్రముఖ నటుడు నటిస్తున్నారు. అయితే తాజాగా సైఫ్ కుటుంబానికి ప్రభాస్ తనదైన స్టైల్‌లో కానుక అందించారు. ఆయన సైఫ్ కుటుంబానికి బిర్యానీని తయారు చేయించి పంపించారు. ఈ విషయాన్ని కరీనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరి ద్వారా తెలియజేశారు. ‘అసలు బాహుబలియే బిర్యానీ పంపిస్తే.. ఇక అది అన్నికన్న బెస్ట్‌గా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన ఆహారం మాకు ఇచ్చిన ప్రభాస్‌కి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m3CUsa
No comments:
Post a Comment