జీవితమైనా సాఫీగా సాగిపోతుందంటే దేవుడైనా ఒప్పుకుంటాడేమో కానీ.. తన షో కూల్‌గా ఉంటే బిగ్‌బాస్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది. హౌస్‌లో కంటెస్టెంట్స్ కామ్‌గా ఉందామని అనుకున్నా ఏదో ఒక రూపంలో బిగ్‌బాస్ సభ్యుల మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి చూస్తారు. అందుకోసం తను ఉపయోగించే స్ట్రాటజీ గేమ్స్. కెప్టెన్ కంటెండర్ టాస్క్ కోసం బిగ్‌బాస్ ‘పంతం నీదా నాదా’ షురూ చేసిన బిగ్‌బాస్, అందులో ముందుగా ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే ఆటను ఆడాలని..సభ్యులను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు బిగ్‌బాస్. మానస్, రవి, నటరాజ్‌మాస్టర్, జెస్సీ, కాజల్, ఉమ, లహరి, సన్ని, శ్వేత ఉన్న టీమ్‌కి మానస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తే.. శ్రీరామ్, విశ్వ, షణ్ముక్, సిరి, హమీదా, యానీ మాస్టర్, ప్రియాంక, ప్రియ, లోబో ఓ టీమ్‌కి శ్రీరామ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండు టీమ్స్‌కు సంబంధించిన డగౌట్స్‌లో పిల్లోస్ ఉంచాడు. ప్రత్యర్థి టీమ్‌లో పిల్లోస్‌ను తమ టీమ్‌లోకి తెచ్చుకుంటూనే తమ టీమ్‌కు చెందిన పిల్లోస్‌ను కాపాడుకోవడటమే ఈ గేమ్. పిల్లోస్ కోసం సభ్యులు ఓ రేంజ్‌లో గొడవపడ్డారు. ఓ సందర్భంలో అయితే సన్నీ తన షర్ట్‌లో చేయి పెట్టాడంటూ సిరి ఆరోపించింది. కానీ తానేం చేయలేదని అన్నాడు. సభ్యులు ఒకనొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో లోబో కిందపడిపోయాడు. ముందు టీమ్ సభ్యులు పట్టించుకోలేదు. కానీ, చివరకు డాక్టర్‌ను పిలిపించాలని కోరారు. దీంతో లోబోను బిగ్‌బాస్ మెడికల్ రూమ్‌కి పిలిపించాడు. ట్రీట్‌మెంట్ తర్వాత మళ్లీ లోబో ఇంట్లోకి వచ్చాడు. సిగరెట్స్ ఎక్కువగా తాగడం వల్లనే లోబోకి అలా అయ్యిందని, సిగరెట్స్ తాగవద్దని రవి చెప్పడంతో, తానిక సిగరెట్స్ తాగనని లోబో ప్రామిస్ చేశాడు. అయితే ఈ ప్రాసెస్‌లో చాలా గొడవలే అయ్యాయి. లోబోకు ఆరోగ్యం సరిగ్గా లేకుంటే, గేమ్ ఆడుతారా..ఛీ అంటూ రవి తన కోపాన్ని వ్యక్తం చేస్తే, విశ్వ రివర్స్ అయ్యాడు. దీంతో రవి, విశ్వ మధ్య పెద్ద గొడవే జరిగింది. కాసేపటికి ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. విశ్వకి రవి సారీ చెప్పాడు. ‘దొంగలున్నారు జాగ్రత్త’ రిజల్ట్‌ను ఇవ్వకుండానే పాస్‌లో పెట్టి, బిగ్‌బాస్ మరో టాస్క్‌ను స్టార్ట్ చేశాడు. ఈ రెండో టాస్క్‌కు ‘సాగరా సోదరా’ అనే టైటిల్‌ను పెట్టాడు. మరి ఇందులో సభ్యులు ఎలా గొడవ పడతారనేది తెలియాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k8VXll
No comments:
Post a Comment