హే పక్కకి పో.. అభిమానిపై చేయి చేసుకున్న పవన్ కళ్యాణ్.. బాలయ్యని తలపిస్తూ స్టేజ్‌పై చిందులు

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన తన శైలికి విరుద్ధంగా ప్రవర్తించారు. సాధారణంగా సినిమా ఈవెంట్లలో పొలిటికల్ ఇష్యూలను మాట్లాడటానికి ఇష్టపడని పవన్ కళ్యాణ్.. ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పొలిటికల్ ఈవెంట్‌గా మార్చేశారు. వైసీపీ పార్టీని తిట్టడానికే ఈ ఈవెంట్ నిర్వహించారా? అన్నట్టుగా పొలిటికల్ పంచ్‌లతో చెలరేగిపోయారు పవన్ కళ్యాణ్. photo courtesy NTV Entertainment సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కి గురైతే మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయన్న ఆయన మీడియాకి చురకలేస్తూ.. ఆ ఇష్యూని వైసీపీ వైపు డైవర్ట్ చేశారు. ఆ సందర్భంలో మెగాస్టార్ సపోర్ట్ లేకుండా సినిమాలు చేశానని వింత వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ వచ్చిందే చిరంజీవి తమ్ముడిగా.. అలాంటిది అన్నయ్య సపోర్ట్ లేకుండా సినిమాలు చేయడం ఏంటో అని జుట్టుపీక్కునే పరిస్థితి తీసుకుని వచ్చారు. ఆ తరువాత వెధవలు, సన్నాసులు, వైసీపీ సెక్స్ రాకెట్లు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్ కళ్యాణ్.. తన సినిమాలను ఆపడం కోసం మొత్తం ఇండస్ట్రీని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ సందర్భంలో దిల్ రాజు కులం గురించి ప్రస్తావిస్తూ.. మీరు రెడ్డే జగన్ మోహన్ రెడ్డి రెడ్డే కాబట్టి.. రెడ్డి.. రెడ్డి కలిసి మాట్లాడుకోండి అంటూ చమత్కరించారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు స్టేజ్‌పైకి రాగా.. పవన్‌లోని రియల్ క్యారెక్టర్ ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఆ క్షణంలో బాలయ్యని తలపిస్తూ.. ఒక్కసారిగా అతన్ని మెడపై చెయ్యి పెట్టి పక్కకి నెట్టేసి.. హే పక్కకిపో.. పక్కిపో.. వెళ్లూ అని చిందులు తొక్కారు. ఆగ్రహంతో ఊగిపోయారు పవన్ కళ్యాణ్. ఈ ఘటనతో అంతా షాక్ అయ్యారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పవన్ మాట్లాడుతుంటే.. ఫ్యాన్స్ మీదికి రావడం ఆయన్ని కింద పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఈ విధంగా రియాక్ట్ కాలేదు.. కానీ ఆయన శైలికి విరుద్ధంగా అభిమాని మెడపై చేయి వేసి పక్కకి నెట్టేస్తూ రంకెలు వేశారు పవన్ కళ్యాణ్. మొత్తానికి ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనలోని మరో షేడ్‌ని బయటపెట్టారు పవర్ స్టార్. ఫ్యాన్స్ విషయంలో మెగా హీరోలు చాలా హుందాగా వ్యవహరిస్తారనే పేరు ఉంది.. అయితే పవన్ కళ్యాణ్ తన వైఖరితో బాలయ్యని మరపించారు. photo courtesy NTV Entertainment


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CL2VmX

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts