మీడియా, వైసీపీని ఏకిపారేశాడు.. ఏ ఒక్కరినీ వదలని పవన్ కళ్యాణ్

రిపబ్లిక్ మూవీ ప్రి రీలీజ్ ఈవెంట్ కాస్త రాజకీయ సభగా మారింది. సుధీర్ఘ ప్రసంగంతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. కానీ ఇండస్ట్రీలోని పెద్దల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించినట్టు అయింది. మీడియా, వైసీపీ, ఇండస్ట్రీలోనిపెద్దలు ఇలా ఏ ఒక్కరినీ కూడా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టలేదు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ జోక్యం, థియేటర్ల వ్యవస్థపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎండగట్టాడు. మంత్రులను, ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశాడు పవన్ కళ్యాణ్. ముందుగా పవన్ కళ్యాణ్ మీడియా మీద సెటైర్లు వేశాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ మీద మీడియా చూపిన అత్యుత్సాహాన్ని ఏకిపారేశాడు. ‘యాక్సిడెంట్ ఎలా అయింది.. హైస్పీడ్‌లో వెళ్లాడు.. చాలా స్పీడ్‌గా వెళ్లాడు.. నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు.. అనే కథనాలు వచ్చాయి.. దానికి పెద్ద స్పీడో మీటర్లు కావాలా? అక్కడ ఇసుక ఉంటే పడిపోయాడు.. దాని మీద కూడా అలాంటి వార్తలు రాస్తే ఎలా.. మేం కూడా మనుషులం.. మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా.. కొంత కనికరించండి.. ప్రస్థానం, ఆటో నగర్ సూర్య సమయంలోనే దర్శకుడి గురించి నిర్మాతలు చెప్పారు.. సినిమా కూడా బాగుంటుందని తెలుస్తోంది. ప్రాథమిక హక్కుల మీద మాట్లాడబోతోన్నట్టు కనిపిస్తోంది. జై హింద్ అనకపోతే నాకు సభను ముగించినట్టు అనిపించదు. భగత్ సింగ్, సుభాష్, చంద్రశేఖర్ ఆజాద్, గాంధీజి వంటి లక్షల మంది ప్రాణత్యాగం చేస్తేగానీ స్వాతంత్ర్యం రాలేదు. అంత గొప్ప త్యాగాలకు మూలం. రాను రాను పాలిటిక్స్‌లో దిగజారుడుతనం వచ్చింది. సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒకెత్తు. దాన్ని పాటించడం చాలా కష్టం. థియేటర్లు బాగుండాలి.. సినిమాలు ఆడాలి.. అని అందరూ కోరుకుంటున్నారు. సినిమా పరిశ్రమ అనేది చాలా సున్నితమైంది.. చాలా ఈజీ టార్గెట్. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి రకరకాల వార్తలు రాశారు. 45 కి.మీ అత్యంత వేగంతో వెళ్తూ.. ఆటోను ఓవర్ టేక్ చేశాడంటూ కథనాలు రాశారు. వైఎస్ వివేకానంద హత్య మీద మాట్లాడాలి.. తేజూ యాక్సిడెంట్ మీద కాదు.. వైఎస్ వివేకానంద హత్య గురించి రాయాలి.. కోడి కత్తితో ఓ నాయకుడిని పొడిచాడు.. అది ఏమైంది.. అని అడగండి.. తేజూ గురించి కాదు.. లక్షలాది మంది గిరిజనలకు వారి భూమి దక్కడం లేదు.. దాని గురించి మాట్లాడండి.. ఆరేళ్ల చిన్నారి బిడ్డ చరిత.. అది వదిలేసి.. తేజూ మీద కథనాలు.. స్పైసీగా ఉండాలంటే.. వైసీపీ సానుభూతిపరులు.. వ్యభిచారాన్ని లీగల్ చేయమన్నారు.. దాని మీద మాట్లాడండి.. తేజూ మీద మాట్లాడటం కాదు.. టీడీపీ కాపు రిజర్వేషన్ల మీద కథనాలు రాయండి.. రాయలసీమలో బలిజలు..బోయ కులస్థులు రాజకీయాల్లోకి.. ఆడవాళ్ల సమస్యల మీద ఇలాంటి వాటి మీద రాయండి.. తేజూ మీద కాదు.. సినిమా వాళ్ల గురించి ఏం రాసినాఎవ్వరూ మాట్లాడరు. రాజకీయ నాయకుల మీద మాత్రం రాయరు.. ఎందుకంటే వారు ఇంట్లోకి వచ్చికొడతారు. కానీ తేజూ ఏం చేయడు.. అమాయకుడు కదా? అందుకే రాస్తారు.. ఇంకా కోమాలోనే ఉన్నాడు.. ఇంకా కళ్తు తెరిచాడో లేదు.. నేను ఇంకా చూడలేదు.. తెలంగాణలో థియేటర్లున్నాయి.. ఆంధ్రలో థియేటర్లు లేవు.. ఎక్కడున్నాయి.. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేస్తే.. చిత్రపరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తే.. మన కాళ్ల వద్దకు వస్తారు అని అనుకుంటున్నారు.. అది తప్పు. ఇన్ని కోట్లు అన్ని కోట్లు తీసుకున్నారు అంటే నాకు బాధగా అనిపించేది.. పది కోట్ల రూపాయలు తీసుకుంటే.. అందులో ట్యాక్సులే పోతాయి. అవి ఎవడో దోచింది కాదు.. కష్టంతో సంపాదించుకుంటున్నారు.. తప్పుడు కాంట్రాక్ట్‌లు వేసి సంపాదించడం లేదు.. జనాలను ఎంటర్టైన్ చేసి.. కిందా మీదా పడి.. బాహుబలిలో ప్రభాస్‌, రానాలా కండలు పెంచి, ఎన్టీఆర్‌లా అద్భుతమైన డ్యాన్సులు, రామ్ చరణ్ అద్భుతమైన స్వారీలు చేస్తే డబ్బులు ఇస్తారు. ఎక్కడి నుంచో ఆడబిడ్డ వచ్చి.. అందరి ముందు డ్యాన్సులు వేస్తే డబ్బులు ఇస్తే దాన్ని కూడా తప్పు అంటే ఎలా . దేన్నైనా తెగేదాక లాగకండి.. సినిమా పరిశ్రమ బాగు కోసం చెబుతున్నాను.. నిర్మాతలు నష్టపోతే.. డబ్బులు ఒదిలేసుకున్నావాడిని. ఎక్కడో మారుమూలలో కిన్నెర మొగులయ్యకు సాయం చేసినవాడిని. అక్రమ ఆర్జిత రాజకీయ నాయకుల మీద మాట్లాడండి. మోహన్ బాబు విద్యానికేతన్‌ను జాతీయం చేయండి.. వారి ఫీజులు.. కూడా తీసుకోండి.. చిత్రపరిశ్రమను చిన్నదేమో కానీ ప్రభావం గట్టింది.. చిత్రపరిశ్రమ వైపు చూడకండి.. కాలిపోతారు.. మీరు లక్ష కోట్లు సంపాదించుకుంటారా? మేం ఇక్కడ అడుక్కుతినాలా? నాకు పిరికితనం అంటే చిరాకు.. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావడమా?.. పేరుకేమో.. పేరుకేమో పెద్ద.. వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్.. ఏం చేస్తాడు.. మాట్లాడండి.. ఎందుకు భయపడుతున్నారు.. అధికారం చేతికి వస్తే ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. అధికారం వచ్చింది కదా? అని పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. విచక్షణారాహిత్యంగా అధికారాన్ని వాడకూడదు. రాజకీయాలు, సినిమాల్లోకి రావాలని నాకు ఇంట్రెస్ట్ లేదు.. పుస్తకాలు, మొక్కలు, చిరంజీవికి బాడీగార్డ్‌లా ఉండేవాడిని. కర్మ సరిగ్గా లేక.. ఇందులోకి వచ్చాను. ఇష్టం కాదు.. బాధ్యతతో పని చేస్తున్నాను.. సినిమా పరిశ్రమ కష్టాలను చెబుతున్నాను.. డ్యాన్సులు, తైతక్కలు ఆడేవాళ్లు అని అంటారు. ఎంతో నాలెడ్జ్ లేకపోతే ఇలాంటి సినిమా తీయలేరు.. సక్సెస్ కొట్టడం ఎంత కష్టమో దిల్ రాజును అడగండి.. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రాంతీయతత్త్వం, కులతత్త్వం ఉండవు. చిత్రపరిశ్రమ జోలికి వస్తే.. అందరం ఏకమవ్వాలి. చిరంజీవిది మంచి మనసు.. ఆయన అలానే బతిమిలాడుకుంటారు. ఏపిలో 11, 12 వందల సింగిల్ స్క్రీన్‌లుంటాయి.. దాని మీద ఆధారపడే ఎంతో మంది ఉన్నారు.. పవన్ కళ్యాణ్ మీద కోపంతో వారి పొట్టకూడ కొడుతున్నారు.. చిత్రపరిశ్రమలో దేవాకట్టాను చూసి నేర్చుకోండి.. మీరెందుకు భయపడుతున్నారు.. గూండాకు, క్రిమినల్ పాలిటీషియన్.. భయపడకండి.. ఈ మధ్య ప్రకాష్ రాజ్‌ను కూడా లోకల్ నాన్ లోకల్ అన్నారు.. అలా అనడం తప్పు. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కుంది.. మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి.. వైఎస్ కుటుంబీకుల మీ బంధువులు కదా? చిత్రపరిశ్రమ జోలికి రాకండి అని చెప్పండి.. ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అని చెప్పండి.. మీకు కూడా నైతిక బాధ్యత ఉంది.. చిత్రపరిశ్రమకు అప్లై చేసిన రూల్.. రేపు విద్యానికేతన్‌కు కూడా వర్తింపజేయచ్చు. చిరంజీవి గారికి కూడా చెప్పండి.. ప్రాధేయపడొద్దని చెప్పండి.. ఇది మన హక్కు.. గట్టిగా అడగండి అని చెప్పండి.. ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి బావా బావా సోదర అని అంటే కాదు గట్టిగా ప్రభుత్వాన్ని అడగండి. తెలుగు చిత్రపరిశ్రమను ఎవ్వరూ ఆపలేరు.. అడ్డుకోలేరు.. జై హింద్’ అని ముగించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WfjzM0

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts