మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడ్డారు సాయి తేజ్. ఈ యాక్సిడెంట్‌లో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి అపోలో షిఫ్ట్ చేసి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలియడంతో మెగా అభిమాన వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే మెడికవర్ ఆసుపత్రికి చెందిన ఎమర్జెన్సీ డైరెక్టర్ ఓ మీడియా మాట్లాడుతూ ఈ యాక్సిడెంట్ వివరాలు, ఆసుపత్రికి వచ్చినపుడు ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని చెప్పారు. సాయి తేజ్‌ని హాస్పిటల్ తీసుకొచ్చిన సమయంలో అపస్మారక స్థితిలో ఉన్నారని, వెంటనే కృతిమ శ్వాస అందించామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషేంట్‌ని ఆసుపత్రికి తీసుకొచ్చాక మొదటి గంటలో ఎంత మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వగలుగుతామో అదే పేషేంట్‌ని సేఫ్ చేస్తుందని అన్నారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలోనే సాయి ధరమ్ తేజ్‌కి ఫిట్స్ వచ్చిందని, తమ ఆసుపత్రికి తీసుకొచ్చాక అవయవాలన్నీ స్కాన్ చేసి ఫస్ట్ హవర్‌లో బెస్ట్ ట్రీట్‌మెంట్ ఇచ్చామని అన్నారు. శ్వాసకు ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ అందించడం, వెన్నెముకకు ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవడం లాంటివన్నీ సరైన సమయంలో జరిగాయని తెలిపారు. ముఖ్యంగా సాయి తేజ్ పెట్టుకున్న హెల్మెట్ కారణంగా ఆయనకు హెడ్ ఇంటర్నల్ ఇంజురీ జరగలేదని ఆయన అన్నారు. అదే ఆయన్ను కాపాడిందని తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hks4wD
No comments:
Post a Comment