స్పోర్ట్స్ బైక్స్ విచ్చలవిడిగా వాడేస్తూ ప్రాణంతో చెలగాటం ఆడవద్దని అన్నారు. మెగా మేనల్లుడు యాక్సిడెంట్‌పై స్పందించిన ఆయన.. తన కొడుకు మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. పిల్లలు పోతే తల్లిదండ్రులకు ఉండే ఆ కడుపుకోతను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు యాక్సిడెంట్‌లో చనిపోవడం ఎన్నటికీ మరచిపోలేనని చాలా సందర్భాల్లో చెప్పిన బాబు మోహన్.. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత మరోసారి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని ఆవేదన చెందారు. కొందరు సరదా కోసం వేగంగా బైక్ నడుపుతారని చెప్పిన ఆయన, అది సరదానే కావొచ్చు కానీ ప్రాణంతో చెలగాటం ఆడటమే అన్నారు. యాక్సిడెంట్ జరిగి వాళ్ళు పోతే పోయారు కానీ అతన్ని ప్రేమించిన వాళ్ళు మానసిక క్షోభ అనుభవిస్తారు. అందరూ అది ఆలోచించుకోవాలని చెప్పారు. ''హెల్మెట్ పెట్టుకొని సాయి ధరమ్ తేజ్ చాలా మంచి పని చేశాడు. అదే కొంతమంది అయితే హెల్మెట్ పెట్టుకోవడం కూడా నామూష్‌గా ఫీల్ అవుతారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతూ థ్రిల్ ఫీల్ అయి యాక్సిడెంట్ కాగానే చతికిలపడతారు. ఏదిఏమైనా బైకులు నడిపేవారు జాగ్రత్త పాటిస్తూ మెలకువగా నడిపితే మంచిది. లేకపోతే అతన్ని నమ్ముకున్న వాళ్ళు చీకట్లోకి వెళ్లిపోతారు. దానికి ఉదాహరణ నేనే. ఓ తండ్రి కొడుకును గనుక కోల్పోతే తండ్రి బాడీ కాలిపోయేవరకు ఆ దుఃఖం ఉంటుంది. కడుపుతీపితో వచ్చే ఆ దుఃఖాన్ని ఎవరూ ఆపలేరు. మిమ్మల్ని కనీపెంచి పెద్ద చేసింది ఇందుకోసమేనా? దయచేసి మోటార్ బైకుల ప్రియులు మీ కుటుంబాన్ని గుర్తుచేసుకొని బైక్ నడపాలని యువతను రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ తల్లిదండ్రులను పూజించాల్సిన బాధ్యత మీపై ఉంది'' అని బాబు మోహన్ అన్నారు. సాయి ధరమ్ తేజ్‌కి ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన హెల్త్ బులెటిన్స్ ద్వారా ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని తెలియడంతో మెగా లోకం ఊపిరి పీల్చుకుంది. మరోవైపు సాయి తేజ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని యావత్ సినీ లోకం పార్థిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3C5BP9I
No comments:
Post a Comment