వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేస్తూ నేచురల్‌గా నటిస్తాడు అనే ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ నాని. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల్లో థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే వర్కవుట్ కాదని అనుకున్నారేమో నిర్మాతలు. అందుకనే అమెజాన్ ప్రైమ్‌లో ‘టక్ జగదీష్’ను డైరెక్ట్ రిలీజ్ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ ‘వి’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదలైంది. ‘టక్ జగదీష్’ సినిమాను థియేటర్స్ విడుదల చేయకుండా అమెజాన్‌లో విడుదల చేయడంపై డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. అయినా నిర్మాతలు తమ పరిస్థితుల కారణంగా అమెజాన్‌లోనే విడుదల చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే ‘నిన్నుకోరి’ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో నాని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడనే సంగతి తెలియాలంటే ముందు కథలోకి వెళదాం... కథ: భూదేవీపురం గ్రామంలో ఆదికేశవ నాయుడు(నాజర్) పెద్దమనిషి. ఊరి పెద్దగా అందరూ బావుండాలని కోరుకుంటాడు. అయితే అదే ఊర్లో ఉండే వీరేంద్ర నాయుడు(డానియల్ బాలాజీ) తండ్రి ఊర్లో గొడవలు పెడుతూ ఉంటాడు. ఓసారి అనుకోకుండా వీరేంద్ర నాయుడు తండ్రిని ఓ వ్యక్తి పంచాయతీలోనే చంపేస్తాడు. దాంతో వీరేంద్ర నాయుడు ఆది కేశవులు, అతని కుటుంబంపై పగ పెంచుకుంటాడు. ఇక అదికేశవ నాయుడు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసు(జగపతిబాబు).. చిన్న కొడుకు జగదీష్ నాయుడు(నాని) ఇతన్ని అందరూ టక్ జగదీష్ అని అంటుంటారు. ఎప్పుడూ టక్ చేసుకుని ఉంటాడు. తన టక్‌ను ఎవరైనా లాగితే వారితో గొడవ పడుతుంటాడు. బోసు ఊళ్లో వ్యవహారాలు చూసుకుంటుంటే, టక్ జగదీష్ సిటీలో ఉంటూ అప్పుడప్పుడూ ఊరికి వచ్చి వెళుతుంటాడు. అనుకోకుండా ఓ రోజు ఆది కేశవనాయుడు గుండెపోటుతో చనిపోతాడు. అప్పుడు బోసు తన అసలు రంగు చూపిస్తాడు. వీరేంద్రతో చేతులు కలిపి.. ఎమ్మార్వో సాయంతో ఆస్థిని తన పేరుపై ఉండేలా చూసుకుంటాడు. అంతే కాదు.. తన ఇంటి ఆడపడుచులకు ఆస్థి ఇవ్వనని అందరినీ ఇంటి నుంచి గెంటేస్తాడు. అసలు బోసు ఉన్నట్లుండి అలా ఎందుకు ప్రవర్తిస్తాడు? నిజం తెలుసుకున్న జగదీష్ అన్నయ్యను ఎలా దారిలోకి తెచ్చుకుంటాడు? వీరేంద్రతో చేతులు కలిపిన బోసుకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సమీక్ష: ఊరు బావుండాలనుకునే పెద్ద మనిషి.. అతని కుటుంబం. అతని చేయాలనుకునే మంచి పనులకు అడ్డుపడే ఒక ప్రత్యర్థి. ఊర్లో, కుటుంబంలో గొడవలు..చివరకు హీరో అంతా తానై కథను ముందుకు నడిపి కథను సుఖాంతం చేయడం. ఇలాంటి ఫార్ములాతో నడిచే కథలను మనం ఎన్నింటినో తెరపై చూశాం. ముఖ్యంగా వెంకటేశ్, బాలకృష్ణ వంటి వారు ఈ నేపథ్యంతో చాలా సినిమాలే చేశారు. ఈ సినిమా కూడా అంతే. డైరెక్టర్ శివ నిర్వాణ కొత్త కథను చెప్పే ప్రయత్నం చేయలేదు. దాదాపు నాజర్ పాత్ర చనిపోయే వరకు ఫ్యామిలీ, ఎమోషనల్ అంశాలతోనే సినిమాను నడిపించారు. తర్వాతే జగపతిబాబు పాత్ర.. విలన్‌తో చేతులు కలపడం.. ఫ్యామిలీలో గొడవలు మొదలు ఇలా కథ నెక్ట్స్ స్టెప్ తీసుకుంటుంది. ఇక నాని.. పాత్రకు సంబంధించిన ఎమ్మార్వో అనే అసలు బ్యాక్ డ్రాప్‌ను బయటకు తేవడంతో ఇంటర్వెల్‌ను పూర్తి చేశారు. ఇక సెకండాఫ్‌లో ఎమ్మార్వోగా ఊల్లోకి రాగానే అన్నకు ఎదురు తిరగడం.. విలన్ భరతం పట్టడం వంటి సన్నివేశాలతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఊరు, కుటుంబం బావుండాలనుకున్న తండ్రి మాటను నిలబెట్టడానికి అందరితో చెడ్డవాడిననిపించుకున్న హీరో..చివరకు తన కుటుంబాన్ని కాపాడుకోవడంతో సినిమా ముగుస్తుంది. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్స్ చూస్తుంటే కార్తి చేసిన చినబాబు సినిమా గుర్తుకొస్తుంది. సినిమా సెకండాఫ్‌లో కాస్త ఊపందుకుంది అనుకుంటున్న తరుణంలో మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథ డ్రాప్ అవుతుంది. మళ్లీ కథ అలా అలా ముందుకెళ్లి శుభం కార్డు తీసుకుంటుంది. నాని తనదైన శైలిలో సినిమా అంతా తానై ముందుకు నడిపించాడు. ఎమోషనల్ సీన్స్, ఫైట్స్‌లో తనదైన స్టైల్‌ను చూపించి మెప్పించాడు. అయితే నాని గత చిత్రాల్లో కనిపించే ఓ హ్యుమర్ ఈ సినిమాలో కాస్త మిస్ అయ్యిందనే చెప్పాలి. ఇక రీతూవర్మ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. ఐశ్వర్యా రాజేశ్ కీలక పాత్రలో ఆకట్టుకుంది. ఇక జగపతిబాబు ఒక వైపు మంచివాడుగా కాసేపు, గ్రేషేడ్స్‌తో కాసేపు నటించారు. ఆయన సునాయసంగా తన పాత్రను క్యారీ చేసేశారు. ఇక రావు రమేశ్, రోహిణి, వి.కె.నరేశ్ తదితరులు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా చూస్తే.. తమన్ సంగీత సారథ్యం వహించిన పాటల్లో ఇంకోసారి ఇంకోసారి .. అనే సాంగ్ బావుంది. మిగతా సాంగ్స్ పర్లేదు. ఇక గోపీసుందర్ నేపథ్య సంగీతం బావుంది. ఇక ఏటికొక్కపూట... అనే ఫైట్ ఉండే సాంగ్ కూడా బావుంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మొత్తంగా చూస్తే.. టక్ జగదీష్ కొత్త కథేం కాదు.. శివ నిర్వాణ గత చిత్రాలైన నిన్నుకోరి, మజిలీలను గమనిస్తే అవన్నీ ఫెయిల్యూర్ లవ్‌స్టోరీస్. వాటికి భిన్నంగా గ్రామీణ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం బావుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఉండే సినిమాటిక్ లిబర్టీని దర్శకుడు బాగానే వాడుకున్నాడు. చివరగా... ‘టక జగదీష్’... రొటీన్ ఫ్యామిలీ డ్రామా
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38S0KBa
No comments:
Post a Comment