మెగా మేనల్లుడు, సుప్రీం హీరో ప్రమాద ఘటన టాలీవుడ్ లోకంలో ఆందోళన నింపింది. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్‌ని వెంటనే దగ్గర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయన చికిత్స కొనసాగుతోంది. మరోవైపు సాయి తేజ్ యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసి కీలక ఆధారాలు సేకరిస్తున్న మాదాపూర్ పోలీసులు.. ఈ ప్రమాద ఘటనపై కొన్ని విషయాలు బయటపెట్టారు. మితి మీరిన వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసు విభాగం ధృవీకరించింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ఆయన 72 కి.మీ స్పీడ్‌తో వెళ్తున్నాడని డీసీపీ పేర్కొన్నారు. ఆటోను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయబోయి స్కిడ్ కావడంతో కిందపడ్డాడని, అయితే ఈ ప్రమాదంలో తేజ్ వద్ద టూ వీలర్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ తమకు లభ్యం కాలేదని అన్నారు. ఆ సమయంలో తేజ్ హెల్మెట్ ధరించాడని, అందుకే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలిపారు. ప్రమాదం కంటే ముందు కూడా దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్ నడుతుపున్నారని.. రాష్ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపారని డీసీపీ తెలిపారు. అలాగే సాయి ధరమ్ తేజ్ నడిపిన స్పోర్ట్స్ బైక్ ఆయన పేరిట రిజిస్ట్రేషన్ అయి లేదని, బహుశా ఆయన సెకండ్ హ్యాండ్ బైక్ అయి ఉంటుందని అన్నారు. ఈ బైక్ హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన బూర అనిల్ కుమార్ పేరుపై ఉందని చెప్పారు. గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్ వద్ద ఓవర్ స్పీడ్‌పై రూ.1,135 చలాన్ పడిందని, అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరో ఆ చలాన్ క్లియర్ చేశారని చెప్పారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అపోలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా విడుదల చేసిన హెల్త్ బులెటిన్స్ ద్వారా సాయి తేజ్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నేడు (ఆదివారం) ఆయనకు కీలక సర్జరీ చేసేందుకు అపోలో వైద్యులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hpLqjV
No comments:
Post a Comment