మెగా కుటుంబానికి చెందిన హీరో సాయిధరమ్ తేజ్ రెండు రోజుల ముందు బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రస్తుం ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు స్కానింగ్, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ తేజ్ తల, వెన్నెముకకు గాయాలు కాలేదని కాలర్ బోన్ విరిగిందని తెలియజేశారు. అప్పటి నుంచి డాక్టర్స్ అబ్జర్వేషన్‌లో వెంటిలేటర్‌పై ఉన్నాడు సాయిధరమ్‌తేజ్. అపోలో హాస్పిటల్లో డాక్టర్ అలోక్ రంజన్ అండ్ టీమ్ అధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్ సహా ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులు అపోలో హాస్పిటల్‌కు వెళ్లారు. సాయిధరమ్‌కు ఆదివారం కాలర్‌బోన్‌కు డాక్టర్స్ శస్త్ర చికిత్సను ప్రారంభించారు. వెంటిలేటర్‌పైనే ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరో 24 గంటల పాటు సాయిధరమ్‌ను వెంటిలేటర్‌పైనే ఉంచబోతున్నారట. వినాయకచవితరోజున రాత్రి ఎనిమిది గంట ఐదు నిమిషాల ప్రాంతంలో ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన తర్వాత మైండ్‌స్పేస్ జంక్షన్ ప్రాంతంలో సాయితేజ్ ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ని దగ్గరలోని మెడికోవర్ హాస్పిటల్‌కు జాయిన్ చేశారు. అక్కడి నుంచి అపోలో హాస్పిటల్‌కు తరలించారు. మెగా కుంటుంబం, ఫ్యాన్స్ అందరూ సాయితేజ్‌కు ఏమవుతుందోనని టెన్షన్ పడ్డారు. అయితే ఆయనకు పెద్ద గాయాలేవీ కాలేదని, కాకపోతే అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పిన డాక్టర్స్ నలబై ఎనిమిది గంటల పాటు వెంటిలేటర్‌పైనే ఉంచబోతున్నట్లు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XhN93V
No comments:
Post a Comment