అక్కినేని కోడలికి అతనితో అంత చనువా? ఐ లవ్ యూ అనడమేంటి..? దెబ్బకు పోస్ట్ డిలీట్ చేసిన సామ్

అభిమానులు- సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గించే సోషల్ మీడియా ఖాతాలు ఒక్కోసారి ఊహించని తలనొప్పులు తెచ్చిపెడతుంటాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్స్ సెలబ్రిటీలకు ఎంత పాపులారిటీ తెస్తాయో.. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతే ఇబ్బంది కలిగిస్తాయి. తాజాగా స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు విషయంలో అదే జరిగింది. ఆమె చేసిన ఓ పోస్ట్ చూసి నెటిజన్స్ ట్రోల్ చేయడంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది సామ్. సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టి సోఫాలో పడుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. నాలుగేళ్లుగా అతడు సమంతకు ఫ్యాషన్ స్టైలిష్టుగా పని చేస్తున్నాడు. ఈ బంధాన్ని గుర్తు చేస్తూ ఆ ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘ఐ లవ్ ‌యూ' అని కూడా క్యాప్షన్ పెట్టడంతో అంతా అవాక్కయ్యారు. కొన్ని నిమిషాల్లోనే ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. దీంతో ఈ ఫొటోను కొందరు నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసుకొని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఎంత క్లోజ్‌ అయితే మాత్రం అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో దిగడమేంటి? ఐ లవ్ యూ అనడమేంటి? అని కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. ఇది చూసిన సమంత వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. 'ఓ బేబీ' తర్వాత ఈ మధ్యకాలంలో సినిమాల జోరు కాస్త తగ్గించిన ఈ అమ్మడు ప్రస్తుతం 'ఫ్యామిలీమెన్ 2' వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవలే గుణశేఖర్ రూపొందించనున్న 'శాకుంతలం' సినిమాలో సమంతను కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y7yC7G

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts