టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ను కలిపిస్తానని మాట ఇచ్చాడు హీరో విజయ్ దేవకొండ. ఇంతకీ ఆయన ఈ మాట ఇచ్చింది ఎవరికో తెలుసా? ఓ అభిమానికి.. వివరాల్లోకెళ్తే, ముంబైలో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ, తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించాడు. ఇందులో విశాల్ అనే నెటిజన్..గత నెలలో ‘మాది కూడా మహబూబ్ నగర్. ఈసారి మీరు అక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకెళ్తా, మా రౌడీలందరితో కలిసి ఏవీడీ(విజయ్ దేవకొండ, ఏషియన్ వాళ్లు సంయుక్తంగా నిర్మించిన థియేటర్స్)లో సినిమా చూద్దా’మని అన్నాడు. దానికి ‘తప్పకుండా ప్లాన్ చేస్తాను.. ఈసారి మన ఇంటకి వెళ్లాం. అక్కడే లంచ్, డిన్నర్ కూడా ప్లాన్ చేసుకుందాం’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. మరో అభిమాని అయితే ‘నేను బెంగుళూరులో ఉంటాను. మీ ఏవీడీ థియేటర్స్‌ను చూడటానికి బెంగుళూరు నుంచి వచ్చాను’ అన్నాడు. దానికి ‘మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలను వెల కట్టలేను. ఇకపై ఏడాదిపాటు మీరు ఎంత మందితో కలిసి ఏవీడీలో సినిమా చూసినా ఆ టికెట్ డబ్బులు నేనే పెట్టుకుంటాను. కాకపోతే ఓ రోజు ముందు మీరు మా టీమ్‌కి మెసేజ్ చేయండి’ అన్నారు విజయ్ దేవరకొండ. విన్ను అనే నెటిజ్ అయితే.. ప్రభాస్, విజయ్ దేవరకొండ సినిమాల్లో ఒకేలా ఉండే సన్నివేశాలతను మిక్స్ చేస్తూ ఓ ప్రోమో తయారు చేశాడు. దానికి విన్ను నీ వీడియో ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. నువ్వు ప్రభాస్ అన్నని కలిసేలా చేస్తాను అని విజయ్ దేవరకొండ తనకు మాటిచ్చాడు. మరి ప్రామిస్‌లను ఎప్పుడూ పూర్తి చేస్తాడో మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aI0yW1
No comments:
Post a Comment