టాలీవుడ్‌కి చెందిన నిర్మాత మహేశ్ కోనేరు మంగళవారం ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి కళ్యాణ్ రామ్‌తో నా నువ్వే, 118 చిత్రాలతో పాటు కీర్తిసురేశ్‌తో మిస్ ఇండియా, సత్యదేవ్‌తో తిమ్మరుసు చిత్రాలను నిర్మించారు. అలాగే తమిళంలో విజయ్, అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన బిగిల్ చిత్రాన్ని తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల చేశారు. ఆయన జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత సినిమాలకు పి.ఆర్.ఓగా మారారు. తర్వాత నిర్మాతగా మారారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు ఆయన పర్సనల్ పి.ఆర్‌గా వ్యవహరించారు. చనిపోయారనే వార్త తెలియగానే తారక్ ‘‘గుండె బాధతో నిండిపోయింది. నమ్మలేకపోతున్నాను. నా ప్రియమైన స్నేహితుడు మహేశ్ కోనేరు ఇక లేరు అనే విషయం తెలియగానే షాకయ్యాను. మాటలు రావడం లేదు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. దర్శకురాలు నందినీ రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా మహేశ్ కోనేరు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘మహేశ్ కోనేరు లేరనే వార్త తెలియగానే షాకయ్యాను. ఆయన వ్యక్తిగతంగానూ నాకు చాలా బాగా తెలుసు.. తీరని లోటు. ఆయన కటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. మరో నిర్మాత ఎస్.కె.ఎన్ స్పందిస్తూ ‘‘గుండె బద్ధలైంది. తల తిరుగుతుంది. జీర్ణించుకోలేకపోతున్నాను. మంచి స్నేహితుడు, ఫి.ఆర్.ఓ, నిర్మాత. చిన్న వయసులో చనిపోవడం ఎంతో బాధాకరం. టెక్నికల్‌గా ఎంతో నాల్జెడ్ ఉన్న వ్యక్తి మహేశ్ కోనేరు. మంచి ఆశయాలతో ముందుకెళ్తున్న అతన్ని ఆ దేవుడు ఎందుకని ఇంత త్వరగా తీసుకెళ్లిసోయాడు’’ అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DoLAka
No comments:
Post a Comment