ప్రకాష్ రాజ్, మధ్య నడిచిన రసవత్తర పోరులో 'మంచు' వారసుడికే అధ్యక్ష పీఠం దక్కింది.107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌ని ఓడించారు మంచు విష్ణు. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు, మంచు మోహన్ బాబుపై ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నాటకీయ పరిణామాల నడుమ నేడు (అక్టోబర్ 13) MAA అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. 'మా' ప్రెసిండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. దీంతో MAA అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు చేసిన రాజీనామాలు అంగీకరిస్తారా? ముందు ముందు ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అనే దానిపై చర్చలు ముదిరాయి. రాజీనామాలు చేసిన వారిని మంచు విష్ణు బుజ్జగించి లైన్ లోకి తీసుకొస్తారా? లేక ఆ స్థానాలు వేరే వాళ్ళతో భర్తీ చేసి ముందుకెళ్తారా? అనేది జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత అందరూ కలిసి పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఈ నెల 16వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FG5HfE
No comments:
Post a Comment