ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధ్యక్ష బరిలో పోటీకి దిగిన మంచు విష్ణు, ప్రకాష రాజ్‌లు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ నేడు (ఆదివారం) జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో 'మా' పోలింగ్ మొదలైంది. మొత్తం 883 మంది సభ్యులు పోలింగ్‌లో పాల్గొననున్నారు. ప్రస్తుతం తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సినీ పెద్దలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మంచు లక్ష్మీ, శ్రీకాంత్, సుమ, సుడిగాలి సుధీర్, ఉత్తేజ్, సాయి వెంకట్, వేణు, ఈటీవీ ప్రభాకర్, మురళీ మోహన్ తదితరులు ఓటు వేసేయగా.. కొన్ని నిమిషాల క్రితం మెగాస్టార్ , బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి 'మా' ఎన్నికల్లో తన మద్దతు అనే విషయంపై ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్య పదతిలో ఎన్నికలు జరగాలని చెప్పిన మెగాస్టార్.. ఓటర్లు ఎవరిని గెలిపిస్తే వారికే తన మద్దతు అని బాహాటంగా ప్రకటించారు. నేను వ్యక్తిగతంగా ఎవ్వరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయనని, తన అంతరాత్మను అనుసరించి ఓటేశానని, అది ఎవరికి అనేది మాత్రం చెప్పనని తెలిపారు. ఓటు వేయకపోవడం అనేది వ్యక్తిగత విషయం అని, ఓటు వేయని వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేనని అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30c5lx4
No comments:
Post a Comment