'మా' ఎన్నికలు అనాలో స్టార్ వార్ అనాలో అర్థంకాని పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మా ఎలక్షన్స్ మరింత హీటెక్కించాయి. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ప్రచార పర్వంలో భాగంగా ఇరు వర్గాల ప్యానల్ మెంబర్స్, ప్రెసిడెంట్ పదివి కోసం పోటీపడుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణల నడుమ సినీ వర్గాల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. 'మా' రెండుగా చీలిపోతుందా? అనే సందేహం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ 'మా' ఎన్నికలపై కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఈ రోజు (అక్టోబర్ 10) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 'మా' ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉదయాన్నే మంచు ఫ్యామిలీ సహా విష్ణు ప్యానల్ మెంబర్స్ అంతా పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్లన్నీ మంచు విష్ణు ప్యానల్ పోస్టర్లతో నిండిపోయాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కడ చూసినా మంచు విష్ణు ప్యానల్ హవానే కనిపిస్తోంది. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది మా సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికల కేంద్రం వద్ద కనిపిస్తున్న హడావిడి, నిన్న మొన్నటి వరకు జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని పవన్ రియాక్ట్ అయ్యారు. తిప్పికొడితే 900 మంది.. 'మా' ఎలక్షన్స్ కోసం వ్యక్తిగత దూషణలు అవసరమా? అంటూ పవర్‌ఫుల్ కౌంటర్ వేశారు. గతంలో తానెప్పుడూ ఇంత పోటీ చూడలేదని, దీనికి ఇంత హడావిడి అవసరమా అని అనిపిస్తోందని ఆయన అన్నారు. సినిమా వాళ్లంటే అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పిన పవన్.. 'మా' ఎలక్షన్స్‌కి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సినీ ఇండస్ట్రీకి చీలడం అనే ప్రశ్నే లేదని అన్నారు. అలాగే చిరంజీవి, మోహన్ బాబు సంబంధాలపై రియాక్ట్ అవుతూ వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అని ఒక్కమాటలో చెప్పేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AnGrqt
No comments:
Post a Comment