'మా' అధ్యక్ష బరిలో ఉన్న , నడుమ హోరాహోరీ పోరు నడుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. మొత్తం 883 మంది మా సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీ తారలు తరలి వస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఓ వైపు రిగ్గింగ్ ఆరోపణలు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా.. పోలింగ్ స్టేషన్ ఆవరణలో కొందరు సినీ నటులు చేస్తున్న హడావిడి చూసి జనం షాక్ అవుతున్నారు. కొద్ది సేపటి క్రితం అనే సినీ నటుడు వీరంగం సృష్టించాడు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దుర్భాషలాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఉదయం నుంచి ఓటు వేసేందుకు వచ్చిన సినీ తారల రాకతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ఆవరణ కార్లతో నిండిపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కార్లను లోనికి అనుమతించడం లేదు. ఈ క్రమంలో ఓటేసేందుకు వచ్చిన అభినవ్ సర్దార్.. ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నా లెక్కచేయకుండా తన కారును లోపలికి తీసుకెళ్లాడు. దీంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఇదేంటని ప్రశ్నించగా ఆయన ఎదురు దాడికి దిగినట్లు సమాచారం. ఎస్సై, కానిస్టేబుల్ ఏ ఒక్కరినీ వదలకుండా దుర్భాషలాడుతూ హల్చల్ చేశాడని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oOfyKo
No comments:
Post a Comment