Kodali Nani: సినీ ప‌రిశ్ర‌మ అంటే ఆ న‌లుగురే కాదు.. కంప్లైంట్స్ వచ్చాయి

‘‘గతంలో విడుదలైన సినిమాలు 50 రోజులు నుండి 100 రోజులు వరకు అడేవి. అయితే కోర్టు ఇచ్చిన జీవోను అడ్డం పెట్టుకొని సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి బెనిఫిట్ షోల పేరుతొ ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతూ ప్రజలను ఇబ్బంది కలిగిస్తున్నారనే కంప్లంట్స్ చాలా వచ్చాయి.ఈ విషయాన్ని చాలా మంది సినీ పెద్దలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు అందుకే ఎవరికీ ఇబ్బంది కలగకుండా మేము తగిన చర్యలు తీసుకోవాలని కుంటున్నాము’’ అన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర స‌ర‌ఫ‌రాల శాఖా . ఆదివారం హైద‌రాబాద్‌లో జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి.జె నిర్మిస్తున్న ‘ఆటో ర‌జిని’ సినిమా ప్రారంభోత్స‌వ‌ కార్య‌క్ర‌మానికి కొడాలి నాని ముఖ్య అతిథిగా విచ్చేసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని యూనిట్‌కి అబినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో పై వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ముందుగా గతంలో ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ హీరోలు,దర్శకులు మాకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని గత ప్రభుత్వాన్ని కోరారు. దానికి వారు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకెళ్లి మా సినిమాలకు రేట్లు పెంచు కోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదని కోర్టుకెళ్లారు దానికి కోర్టు చెప్పింది ఏందంటే మీరు ఒక కమిటీ వేసుకొని కమిటీ నిర్ణయాన్ని మా దృష్టికి తీసుకొస్తే మేము తగిన నిర్ణయం తీసుకుంటామని కోర్టు చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేయలేదు. కమిటీ వేయలేదని మళ్ళీ వీరందరూ కోర్టుకెళ్లారు. అయితే కోర్టు మీరు కమిటీ వేసి నిర్ణయం తీసుకునే వరకు మీరు ఎంతైనా టికెట్ రేట్లు అమ్ముకోమ‌ని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజానీకానికి ఇబ్బంది కలిగిస్తున్నారని మా దృష్టికి రావడంతో దాన్ని అరికట్టాలని ఏ హైకోర్టు అయితే పర్మిషన్ ఇచ్చిందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడ ఏం రేట్లు ఉండాలనే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ విషయంపై మళ్లీ కోర్టుకెళ్లారు కమిటీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని కోర్టు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడున్న ప్రజలను ఎగ్జిబిటర్స్, థియేటర్ యాజమాన్యం వారిని దృష్టిలో పెట్టుకొని సినిమా ప్రొడ్యూసర్స్ తో మా పేర్ని నాని గారి ఆధ్వర్యంలో చర్చలు జరుపుతున్నారు. అయితే నిర్మాతలు మా ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు చేశారు వాటిని మేం ఎంతవరకూ చేయగలమో చూసుకొని వాటిని మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి చర్చించి అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామరస్యమైన వాతావరణంలో సమస్యను పరిష్కరిస్తాము. అంతే కానీ నలుగురు హీరోలు ,నలుగురు దర్శకులు, నలుగురు నిర్మాతలకు సంబంధించింది కాదు ఈ ఇండస్ట్రీ. సినీ పరిశ్రమ అనేది కొన్ని వేల మందికి జీవనోపాధి కలిగించేది సినీ పరిశ్రమ ఇక్కడున్న ప్రతి టెక్నీషియన్ కి సినిమానే లోకంగా బతికే ప్రతి డిస్ట్రిబ్యూటర్ నిర్మాతలకు ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి అదేవిధంగా ప్రజలకు కూడా అన్యాయం జరగకూడదనే తపనతో మా ప్రభుత్వం అందరిని కలుపుకొని చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేకుండా చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని చూడకుండా అందరిని బతికించాలనేది మా ప్రభుత్వం నిర్ణయం. అందుకే ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచించి తగు చర్యలు అందరికీ ఆమోదయోగ్యమైన ఉండేలా అందరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సినీ పరిశ్రమను రక్షించడానికే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ ముందు ఉంటుంది .నలుగురికి ఇబ్బంది కలిగితే కలగచ్చు గానీ 90% మందికి మేలు జరుగుతుంది ఒక సినిమాను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు ఓవరాల్ గా ఇండస్ట్రీలో దృష్టిలో పెట్టుకొని చూస్తుంది . ప్రస్తుతము సినిమా ఒక హైదరాబాదు లో మాత్రమే షూటింగ్ జరగట్లేదు ప్రపంచ వ్యాప్తంగా వెళ్లి షూటింగ్ జరుపు కుంటున్నారు మేము తెలుగు సినిమాని ఆంధ్రప్రదేశ్ లో కొంత తీయాలి అని కోరుకునే వ్యక్తులము మేము కచ్చితమైన నిబంధనలతో ఖచ్చితంగా సినిమా ఇక్కడే తీయాలని మాకు లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా నిర్మాతలకు, హీరోలకు, దర్శకులకు, టెక్నీషియన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఈ రకమైన సౌకర్యాలు కావాలని , మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే సినిమా ఇక్కడ తీస్తామని వస్తే తప్పకుండా మా సహాయ సహకారాలు కచ్చితంగా ఉంటుంది.చాలామంది చిన్న సినిమా నిర్మాతలు ప్రెస్మీట్లు పెట్టి మా సినిమా రన్నింగ్ లో ఉండగా పెద్ద సినిమా ఉందని మా సినిమా తీసేస్తున్నారని చాలామంది ప్రెస్మీట్లు పెట్టి వారు వ్యతిరేకతను చాటుకున్నారు. వాటిని అడ్డుకట్ట వేసి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా అందరు నిర్మాతలు కూడా సమానంగా సినిమా రిలీజ్ చేసుకోవాలని కోరుతున్నాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ 30 సినిమాలు చేశాడు ఆయనను ఎవరూ టార్గెట్ చేయలేదు.ఇన్ని సినిమాలు చేసిన పవన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఏమైనా చేయగలిగాడా.. తను ఇంకా 30 సినిమాలు చేసిన ఏమైనా చేయగలడా ..పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ అయినా..ఫ్లాప్ అయినా మాకు ఏమైనా లాభమా..మేము ఎప్పుడూ ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి ఏం చూసాడు ,మేమేమైనా చేతులకు గాజులు తొడుక్కొని కుచున్నామా పవన్ కళ్యాణ్ అంటే అదిరిపోయే బెదిరిపోయి కంగారుపడి పారిపోయే బ్యాచ్ మాది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు .వారికి ఆంధ్రప్రదేశ్లో ప్రజల సపోర్ట్ ఉంది పైన ఉన్న భగవంతుడు సపోర్ట్ ఉంది రాజశేఖర్ గారికి అండ ఉంది. మేము ఇటువంటి ఉడుత ఉప్పులకు చింతకాయలు రాలవు.జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరించ గలిగినవాడు గాని భయపెట్ట గలుగిన మగాడు కానీ ఇప్పటివరకు ఈ భూమ్మీద పుట్టలేదని నేను పవన్ కళ్యాణ్ కావచ్చు ఆయనకు వార్నింగ్ ఇస్తున్న పేపర్ పులులకు, మీడియా చెపుతున్నాను. మీకు జీవితకాలం నేను టైం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేలి మీద ఈక ముక్క కూడా ఎవడూ పీకలేరు’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ovVzzJ

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts