వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాలేదు. ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఆమె బిజెపిలో చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. ఆమె తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూనే ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలోని బిజెపికి తన సపోర్ట్‌ను తెలియజేస్తూనే ఉంది. డైరెక్ట్‌గానో, ఇన్ డైరెక్ట్‌గానో కంగనా రనౌత్ సపోర్ట్ తీసుకుంటున్న ప్రభుత్వం ఆమె భవిష్యత్‌లో తమ పార్టీలోకి జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకుందేమో అనుకునేలా ఓ పని చేసింది. బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండే ఉత్తర ప్రదేశ్ నిర్వహిస్తున్న డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ అనే ప్రభుత్వ పథకానికి కంగనా రనౌత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఇందులో భాగంగా 75 జిల్లాల్లో ట్రెడిషనల్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని అడిషనల్ చీఫ్ సెక్రటరీ నవనీత్ సింఘాల్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగం కావడానికి కంగనా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం పడుతుండటంతో ఈ బేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరి కంగనా ఈసారైనా తన రాజకీయ రంగ ప్రవేశంపై ఏదైనా నిర్ణయాన్ని ప్రకటిస్తారేమో చూడాలి. రీసెంట్‌గా జయలలిత బయోపిక్ తలైవిలో టైటిల్ పాత్రలో నటించిన కంగనా రనౌత్ ఇప్పుడు ధాకడ్, తేజస్ చిత్రాల్లోనూ నటిస్తుంది. మరో వైపు భారత దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌లోనూ నటించడానికి సన్నాహాలు చేసుకుంటుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uvoUvn
No comments:
Post a Comment