బొమ్మ ఎప్పుడు పడితే.. అప్పుడే మనకు నవ్వుల పండగ: F3 కీలక అప్‌డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

2019 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన F2 సినిమాకు సీక్వల్‌గా మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్టరీ , మెగా ప్రిన్స్ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. F2ని మించి F3లో ఫన్ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపేలా ఇప్పటివరకు వదిలిన అప్‌డేట్స్ ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకుల్లో ఆతృత మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా F3 రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ పంచుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సారి 'ట్రిపుల్ ఫన్ గ్యారంటీ' అని తెలుపుతూ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 25వ తేదీ 2022న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని ''బొమ్మ ఎప్పుడు పడితే.. అప్పుడే మనకు నవ్వుల పండగ'' అంటూ ఆసక్తికర ట్యాగ్ లైన్ రాశారు. ఈ మేరకు వదిలిన పోస్టర్‌లో 2000 రూపాయల నోట్లు కనిపిస్తుండటం సినిమాలో ఏదో కొత్తగా చూపించబోతున్నారని తెలుపుతోంది. గతంలో F2 సూపర్ హిట్ సాధించడమే గాక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ F3 సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో మరోసారి కుటుంబ సమేతంగా థియేటర్స్‌లో ఫన్ రైడ్ చేయాలని ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3no2qt1

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts