ఆ క్షణాన అనుకున్నా.. ఇక మనకు తిరుగులేదని! పెళ్లి సందD వేడుకలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ''. పాతికేళ్ల క్రిందట పొందిన 'పెళ్లి సందడి' ఫీల్ ఈ తరం ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మోడ్రన్ 'పెళ్లి సందD'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రాఘవేంద్ర రావు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. కొత్త అమ్మాయి శ్రీ లీల హీరోయిన్‌గా పరిచయమవుతోంది. అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు (అక్టోబర్ 10) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన , వెంకటేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర విషయాలు బయటకు తీశారు. దాదాపు 40 ఏళ్ల క్రిందటి సంగతులు మొదలుకొని నేటి పరిస్థితుల వరకు అన్నింటినీ ప్రస్తావించారు. 1980 దశకంలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సినిమా చేస్తే చాలు తమ కెరీర్ స్థిరపడినట్లే అని నటీనటులు భావించేవారని, అదే కోరికతో ఉన్న తనకు 'అడవి దొంగ' రూపంలో ఆయన సూపర్ డూపర్ హిట్ ఇచ్చి నిర్మాతలకు కనకవర్షం కురిపించారని అన్నారు. ఆ క్షణాన ఇక మనకు తిర్గిలేదని అనుకున్నానని తెలిపారు. ''ఆనాడు బెజవాడలో ‘పెళ్లి సందడి’ 175రోజుల వేడుకకు నేనే ముఖ్య అతిథిగా వెళ్ళాను. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇప్పుడు అదే ‘పెళ్లి సందD’ వేడుకకు నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. రాఘవేంద్ర రావులో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ నేటి దర్శకులు నేర్చుకోవాలి, ఒక కుటుంబ సభ్యుల్లా అందరూ కలిసి ఉండాలి. వెంకటేష్‌ నా చిరకాల మిత్రుడు. తన సినిమా బాగుంటే నేను, నా సినిమా నచ్చితే తను ఒకరినొకరం ఫోన్ చేసి అభినందించుకుంటాం. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అందరు హీరోల మధ్య ఉండాలి. మన ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. వివాదానికి మూలం ఎవరో కనుక్కోండి.. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టగలిగితే మనదే వసుధైక కుటుంబం'' అని చిరంజీవి అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YAbXof

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts