సింగర్ సోషల్ మీడియాలో షేర్ చేసే అంశాలు, ఎత్తి చూపే తప్పులు, ప్రశ్నించే విధానం అందరికీ తెలిసిందే. తమిళ స్టార్ రైటర్ వైరముత్తుతో చిన్మయికి ఉన్న వైరం తెలిసిందే. తనను లైంగిక వేధించాడంటూ మీద చిన్మయి చేసిన ఆరోపణలు కోలీవుడ్‌ను షేక్ చేసింది. వైరముత్తు మీద అలానే ఇంకొంత మంది అమ్మాయిలు కూడా ఆరోపణలు చేశారు. అయితే గత రెండు మూడేళ్లుగా వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాడుతూనే వస్తోంది చిన్మయి. ‘ఈ క్రమంలోనే చిన్మయిని డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి బహిష్కరించారు. అందులో రాధా రవి ప్రమేయం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైరముత్తు సీఎం స్టాలిన్‌ను కలిశాడు. దీంతో చిన్మయి తీవ్ర ఆవేదనకు లోనైంది. ఇక ఆ దేవుడే అంతా చూసుకుంటాడు అని చేతులెత్తేసింది. మూడేళ్ల క్రితం ఇదే నవరాత్రి టైంలో నన్ను వేధించిన వైరముత్తు గురించి చెప్పాను. కానీ ఈ మూడేళ్లలో ఆయనకు ఏం జరగలేదు. ఏం మారలేదు. కానీ నా విషయంలో ఎన్నో మార్పులు జరిగాయి. కోర్టు చుట్టూ తిరిగాను. రాధా రవి నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు స్టాలిన్‌తో వైరముత్తు భేటిని చూశాకా.. ఇంకా బాదేస్తోంది. నాతో పాటు దాదాపు 20 మంది అమ్మాయిలు అతను అలాంటివాడే అని చెప్పాక కూడా అతనికి ఇంకా సపోర్ట్ దొరుకుతోంది. ఇక నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నాను. వీరి దురాగతాలను నేను ఆ దేవుడికి చెప్పుకుంటాను. ఇలాంటి సమయాల్లోనే అసలు దేవుడనే వాడున్నాడా? అని అనుమానం కలుగుతుంది. వారు చేసిన పనులకు, కర్మలకు ఫలితాన్ని అనుభిస్తారు. ప్రశాంతతను వెతుక్కోవడానికి నా దారులు నాకున్నాయి. ఇలాంటి మగవాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో మాలాంటి మహిళలు అతి కష్టంగా బతికేందుకు కూడా దారులున్నాయి. నేను కూడా బతుకుతాను. ఇక వీటికి ఎవ్వరినీ కూడా జవాబుదారిగా ప్రశ్నించను. ఎందుకు ఎవ్వరికీ కూడా జవాబుదారీతనం లేదు. ఎప్పుడైనా సరే మగాళ్లు మగాళ్లే’ అంటూ అసహనం వ్యక్తం చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mSt7G5
No comments:
Post a Comment