రీసెంట్గా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో విజయం సాధించి ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా తన సోదరుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవాలని ఆశిస్తూ అదేరోజు ట్వీట్ చేశారు. ఈ రోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం. నా సోదరుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచాన్ని మార్చడానికి నువ్వు ప్రారంభించనున్న కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ అంటూ మంచి లక్ష్మి ట్వీట్ చేశారు. మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు ట్రోల్ చేయడం జరిగింది. ‘మా’ అధ్యక్షుడు ప్రపంచం మొత్తాన్ని ఎలా మార్చగలడంటూ పంచులు వేశారు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారిపై మంచు లక్ష్మి మండిపడింది. ఎదుటివాళ్ల మాటను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఛాన్స్ దొరికితే చాలు ఇలా కామెంట్ చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ''ఇకనైనా ఆపండి.. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా.. ఎవర్ని ఎప్పుడు కామెంట్ చేద్దామా.. అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ఓ ప్రపంచం. కాబట్టి, నా ఉద్దేశం మీరనుకునే ప్రపంచం కాదు. ‘మా’ అసోసియేషన్ అనే ప్రపంచాన్ని మార్చడం'' అని ఆమె క్లారిటీ ఇచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n0jPru
No comments:
Post a Comment