బైక్ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తేజూ ఆరోగ్య పరిస్థితిపై సరైన అప్డేట్ ఏదీ రాలేదు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. పవన్ కళ్యణ్ అయితే ఇంకా కోమాలోనే ఉన్నాడని చెప్పాడు. రిపబ్లిక్ ఈవెంట్‌ను లైవ్‌లో చూశాడని దేవా కట్టా చెప్పాడు. అలా ఒకే సందర్భంలో ఇద్దరూ అలా వేర్వేరుగా చెప్పడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు తేజు అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. నేడు (అక్టోబర్ 15) సాయి ధరమ్ తేజ్ బర్త్ డే. పైగా నేడు దసరా. ఇందులో మరో విశేషం కూడా వచ్చి చేరింది. నేడు సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ మేరకు ఈ విషయాన్ని చిరంజీవి ఎంతో ఆనందంగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇది వాడికి పునర్జన్మలాంటిదని అన్నాడు. ఇక తాజాగా కూడా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రకటన చేశాడు. ‘అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ కోలుకొని ఈరోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజయ దశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజు పుట్టినరోజు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల అభిమానాలు మరింతగా పొందాలను శక్తిస్వరూపిణిని ప్రార్థిస్తున్నాను. తేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడి.. తేజ్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయాల్లో, ప్రార్థన మందిరాల్లో పూజలు చేశారు. వారందరి ప్రార్థనలు ఫలించాయి. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని అన్నాడు..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DDlhqq
No comments:
Post a Comment