శారీరకంగా అది పెద్ద సవాల్‌.. ఓపెన్‌గా చెప్పేసిన నిధి అగర్వాల్! ఇస్మార్ట్ బ్యూటీ క్రేజీ ఫీలింగ్స్

పవర్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా మారారు. రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత 'వకీల్ సాబ్' అంటూ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చి భారీ సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ''. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కళ్ళకు కట్టినట్లు చూపాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న .. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ షూటింగ్ విషయమై ఓపెన్ అయింది. 'హరి హర వీరమల్లు'లో తాను పంచమి అనే యువరాణిగా నటిస్తున్నానని చెప్పిన నిధి.. ఇది తన కెరీర్‌లోనే ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ రోల్ చేయడమనేది శారీరకంగా చాలా పెద్ద సవాల్ అని ఆమె చెప్పడం విశేషం. పంచమి రోల్ కోసం ఒంటిపై చాలా బరువైన ఆభరణాలు ధరించాల్సి వచ్చిందని, వాటిని క్యారీ చేస్తూ షూట్‌లో పాల్గొనడం ఎంతో కష్టంగా అనిపించేదని నిధి పేర్కొంది. ఓ షాట్‌ ఫినిష్ కాగానే జాగ్రత్తగా ఓ దగ్గర కూర్చోవడమే తప్ప విశ్రాంతి తీసుకోవడానికి ఏ మాత్రం వీలుండేది కాదని ఆమె తెలిపింది. అయితే ఈ కష్టాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నానని, ఇలాంటి ఓ అద్భుతమైన సినిమాలో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు. మ్యూజిక్ దిగ్గజం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aULt3p

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts