టాలీవుడ్‌లో నేటి ఆదివారం అందరికీ గుర్తుండిపోతంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హిస్టరీలోనే నేడు సంచలనం జరిగింది. తన ఆధిక్యతను చూపించాడు. ప్రకాష్ రాజ్ మీద సంచలన విజయం నమోదు చేశాడు. అయితే ఇది ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అన్నట్టుగా జరగలేదు. నాగబాబు ఎంట్రీతో ఇది మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు విష్ణు అన్నట్టుగా జరిగింది. అయితే ఇదే క్రమంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లిసందడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కుచిరంజీవి, వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో వెంకటేష్‌తో ఉన్నఅనుబంధాన్ని వివరిస్తూ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న వివాదాల గురించి మాట్లాడాడు. ‘అందరి హీరోల మధ్య మాలాంటి ఆహ్లాదకర వాతావరణం ఉంటే.. ఇలాంటి వివాదాలు, కొట్టుకోవడాలు, మాటలు అనడం, అనిపించుకోవడం ఉండదు కదా?.. ఏదైనా సరే శాశ్వతం కాదు. రెండేళ్లుంటాయా? మూడేళ్లు ఉంటాయా? నాలుగేళ్లు ఉంటాయా? ముఖ్యంగా చిన్న చిన్న పదవులు, బాధ్యతల్లాంటివి..వాటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే.. బయటి వాళ్లకు ఎంతటి లోకువ అవుతాం. ఒక పదవి కోసం అంత లోకువ కావాలా? అది ఎవరైనా కానీయ్.. నేను ఏ ఒక్కరినీ వేలెత్తి నిందించడం లేదు. ప్రతీ ఒక్కరూ మెచ్యూర్డ్‌గా, విజ్ఞతతో ఉండాలి. అంతే తప్పా.. మన ఆధిపత్యం, ప్రభావం చూపించడానికి చేయకూడదు. వాళ్లు అన్నారు. కదా? అని మనం అనకూడదు. సమస్య ఎక్కడ ప్రారంభం అయిందా? అనేది చూడాలి. ఎవరి మూలాన ఇలాంటి వివాదాలు ప్రారంభమయ్యాయో అతడికి హోమియో వైద్యం చేయించాలి. ఎందుకంటే మొదళ్ల నుంచి వ్యాధిని తొలిగించే లక్షణం వాటికి ఉంటుంది. మనం కూడా మూలాల్లోకి వెళ్లాలి. అలాంటి వారిని గుర్తించాలి. వారిని గనుక దూరం పెడితే ఇప్పుడు మేం ఎలా ఉన్నామో అందరూ అలా వసుదైక కుటుంబంలా ఉంటాం. ఆత్మీయంగా, ఆప్యాయంగా, ప్రేమగా ఉండాలే తప్పా.. చిన్నచిన్న గొడవలతో అవతలి వారికి లోకువ కాకూడదు. ముఖ్యంగా మీడియా వారికి మనం ఆహారం అయిపోకూడదు’ అని చిరంజీవి పరోక్షంగా మా ఎన్నికలపై స్పందించాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BtCPEM
No comments:
Post a Comment