సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి నటీనటులతో లాంటి దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే సాధారణ ప్రేక్షకుడికి సైతం అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి అనే సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటితో అద్భుతంగా మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక తీరా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. హీరో అలా ఉన్నా కూడా.. ఆయన కోరిక, సంకల్పం మేరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ మూవీని ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలకు ముందుగానే చూపించారు. వారంతా కూడా తేజూ నటనను మెచ్చుకున్నారు. ఇక ఇప్పటికే కొన్ని చోట్ల ప్రివ్యూలు కూడా పడ్డాయి. నెటిజన్లు కూడా రిపబ్లిక్ చిత్రాన్ని వీక్షించినట్టున్నారు. వారు కూడా తేజూ నటన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవా కట్టా విజన్‌ను సాయి ధరమ్ తేజ్ ద్వారా చూపించారు.. తద్వారా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేట్టు చేశారు. ప్రస్తుతం మన సమాజంలోనే కొన్ని సమస్యలను చూపించారు.. సిస్టింలోని లొసుగులను ఎత్తిచూపారు అంటూ ఓ నెటిజన్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. నువ్ ఈ సిస్టింలో ఉండలేకపోతే.. సిస్టింలోంచి బయటకు వెళ్లగొట్టబడతావ్ అంటూ దేవా కట్టా రాసిన డైలాగ్‌ను ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అని ప్రశంసలు కురిపించాడు. ఫుల్ సీరియస్ మూవీ అని కొందరు.. మొదటి సీన్ నుంచి నేరుగా వైసీపీ మీదే కౌంటర్లు వేసినట్టు అనిపిస్తుందని మరి కొందరు.. ఈ మధ్య కాలంలోనే ఇంత మంచి సినిమా చూడటం జరిగింది.. నెగెటివ్ రివ్యూలు ఎందుకు ఇస్తారంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద సినిమా తీశాడని, విశాఖ వాణిగా రమ్యకృష్ణ అదరగొట్టేసిందని, సినిమా హిట్ అంటూ సాయి ధరమ్ తేజ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. ఓ నిజాయితీ గత చిత్రాన్ని చూశాను.. చూస్తున్నంత సేపు ఆలోచించేలా థియేటర్ బయటకి వచ్చాక కూడా మనసులో నిలిచే చిత్రం రిపబ్లిక్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటనలో పది మెట్లు ఎక్కినట్టు అనిపించింది. ఎన్నో మంచి సన్నివేశాలు, సంభాషణలు దేవా కట్టా గారి మార్క్‌ను చూపించింది అని ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ మాత్రం హిట్ కొట్టేసినట్టు కనిపిస్తోంది. అయితే పూర్తి స్థాయి రివ్యూ మాత్రం మరి కాసేపట్లో రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3imGVHv
No comments:
Post a Comment