బాలకృష్ణ వాచ్‌మెన్‌ని ఎవరు చంపేశారో.. బెల్లంకొండపై కాల్పులు ఎందుకో పవన్ 2 లక్షల పుస్తకాల్లో లేదా?: వల్లభనేని వంశీ సంచలన కామెంట్స్

సామాన్యుడు యాక్‌క్‌క్.. తూ!! అనేట్టుగా తయారయ్యారు ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు. అధికార-ప్రతిపక్షపార్టీలు ఒకర్నిమించి ఒకరు అనేట్టుగా పచ్చి బూతులు తీట్టుకుంటున్నారు. సన్నాసి, దద్దమ్మా, అమ్మ, అక్క, ఆలీ ఈ బూతులన్నింటినీ దాటేసి.. రాయడానికి అసహ్యం అనిపించే పచ్చిబూతులతో రెచ్చిపోతున్నారు. గత వారం రోజులుగా ఏపీ రాజకీయం హీటెక్కుతుంది. ఒకర్నొకరు దూషించుకుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.. పోటా పోటీ ప్రెస్ మీట్‌లు ధర్నాలు.. కేసులు.. అరెస్ట్‌లతో ఏపీ పాలిటిక్స్ ఓవర్ హీట్‌లో నడుస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. ముఖ్యమంత్రి జగన్‌ని పచ్చిబూతులు తిట్టడం దానికి నిరసనగా టీడీపీ ఆఫీస్‌లపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం. గొడవకు కారణమైన పట్టాభిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం.. చంద్రబాబు అండ్ టీం నిరసన దీక్షలకు దిగడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య బూతు పంచాయితీ నడుస్తుంది. ఈ తరుణంలో టీడీపీ సానుభూతిపరుడిగా.. చంద్రబాబు పార్టనర్‌గా వైసీపీచే ఆరోపింపపడుతున్న జనసేన అధ్యక్షుడు వైసీపీ తీరును తప్పుపడుతూ తన స్పందనను తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో అటు చంద్రబాబుతో పాటు.. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ మంత్రులు. అసలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్‌ని వేరు చేసి చూడాల్సిన పనిలేదని.. చంద్రబాబు ఏది రాసి పంపితే అది పవన్ కళ్యాణ్ చదువుతారని కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే సైతం పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో హిందూపురం ఎమ్మెల్యే, నట సింహం నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను తెరపైకి తీసుకుని వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ. ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ దేని మీద అయినా ప్రశ్నించవచ్చు.. రెండు లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి ఖచ్చితంగా ప్రశ్నించాలి.. మనిషి జీవితంలో సాధారణ జీవితంలో 20-25 వేల రోజులు కూడా ఉండవు. ఈ లెక్కన చూసుకుంటే.. రోజుకి 10 పుస్తకాలు చదవాలి. ఫుల్ టైం బతికిన వ్యక్తి రోజుకి 10 పుస్తకాలు చదివితే 2 లక్షల పుస్తకాలు చదవొచ్చు. లేదంటే రజనీకాంత్ రోబో సినిమాలో లాగ.. పుస్తకాలు పట పటా చదివేస్తే పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివి ఉండొచ్చు. ఇలా 2 లక్షల పుస్తకాలు చదివిన సూక్ష్మ సత్యాగ్రహి, అత్యంత తెలివైన వాడు కాబట్టి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. పింగళి దశరథ రామయ్య తెలిసే ఉంటుంది.. ఎన్ కౌంటర్ పత్రిక ఎడిటర్.. ఆయన ఎలా చనిపోయాడా పవన్ కళ్యాణ్ ఎంక్వరీ చేపించవచ్చు. అలాగే మల్లెల బాబ్జీ అని ఒకడు ఉండేవాడు.. ఎన్టీ రామారావు మీద హత్యా ప్రయత్నం చేశాడు.. ఆయన ఎలా చచ్చిపోయాడో కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు. అలాగే నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో బెల్లంకొండ సురేష్‌ని సత్యనారాయణ చౌదరిని కూడా ఎవరు కాల్చారో కూడా పవన్ కళ్యాణ్ సీబీఐ ఎంక్వరీ ద్వారా అడగొచ్చు. అలాగే నందమూరి బాలకృష్ణ గారి ఇంటి వాచ్‌మెన్‌ని ఎవరు చంపేశారని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ చదివిన పుస్తకాల్లో తప్పకుండా ఉండి ఉండొచ్చు. అలాగే ఈ రాష్ట్రంలో శిరోముండనం కేసులు కూడా ఉన్నాయి. వాటిని కూడా అడగొచ్చు.. భరణం కేసులు కూడా ఉన్నాయి.. వాటిని కూడా అడగొచ్చు. కేవలం కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవే కాదు.. ప్రపంచంలో చాలా కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు రాత్రికి రాత్రి సూట్ కేసులు ఎవడు ఎత్తుకుని పోయాడు.. సైకిల్ ఎవడు ఎత్తుకునిపోయాడు. కుర్చీ ఎవడు ఎత్తుకుపోయాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చదివే ఉండాలి.. ఎందుకంటే ఆయన సూక్ష్మ సత్యాగ్రహి.. పైగా ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నాడు కాబట్టి చక్కగా వీటన్నింటిపై అమిత్ షాతో చర్చించి ఎంక్వరీలు వేయొచ్చు.. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 లక్షలు పుస్తకాలు చదివాడు.. మరో నాలుగు లక్షల పుస్తకాలు చదివి ఇంకా చాలా ప్రశ్నించాలని కోరుతున్నా’ అంటూ సెటైర్లు వేశారు వల్లభనేని వంశీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EdzJG5

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts