మోహన్ బాబు ఇది మీ కోసమే.. ‘మా’ బిల్డింగ్ వివాదంపై చురకలు.. నరేష్‌ను లాగిన నాగబాబు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని ఊపేస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్, జీవిత రాజశేఖర్ ఎంట్రీ, బండ్ల గణేష్ బయటకు రావడం ఇలా ఎన్నెన్నో ట్విస్టులు జరుగుతున్నాయి. మధ్యలో మా బిల్డింగ్ అంశం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఆ మధ్య జూమ్ మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్లు ఇచ్చారు. ‘ఇది మా అసోసియేషన్ సభ్యులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ప్రకాష్ రాజ్‌ను మా అధ్యక్షుడిగా మేమంతా బలపరుస్తున్నాం. అయితే ఎన్నికల ప్రచారంలో మేం ప్రకాష్ రాజ్ శక్తి, సామార్థ్యాలు మాత్రమే మాట్లాడాలని, మిగతా అంశాల గురించి మాట్లాడొద్దని అనుకున్నాం. కాకపోతే కొంత మంది మాత్రం వివాదాలు రేకెత్తించాలని చూస్తున్నారు. మా అసోసియేషన్‌కు నేను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో అంటే 2006 నుంచి 2008 వరకు బిల్డింగ్‌ను కొన్నాం. అంతకు ముందు నుంచే బిల్డింగ్ సమస్య ఉంది. చాంబర్ వాళ్లు మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చేవారు. అలా అప్పుడు కొత్త బిల్డింగ్ కొనాల్సి వచ్చింది. కానీ ప్రతీ సారి ఎన్నికల్లో మా బిల్డింగ్ కొన్నారు.. అమ్మారు అంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు. ఎవరో చిన్నవాళ్లు అంటే నేను స్పందించే వాడిని కాదు. కానీ మోహన్ బాబు లాంటి వారు అడిగారు. మొన్న మా అసోసియేషన్‌కు జూమ్ మీటింగ్ జరిగింది. అది బయటకు రాకూడదు. ఎలా బయటకు వచ్చిందో. కండక్ట్ చేసిన వాళ్లు చూసుకోవాలి. ఇందులో మోహన్ బాబు గారు ఎందుకు మా బిల్డింగ్ కొన్నారు.. ఎందుకు అమ్మారు.. అంటూ అడిగారు. కానీ ఆయన నా పేరు ఎత్తలేదు. మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద మనిషి. ఆయన అడగడంలో తప్పు లేదు. ఇది ఆరోజే అడగాల్సింది. కానీ ఇంత ఆలస్యంగా అడిగారు. అడగడం మంచిదే. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే.. ఎన్నికల్లో భాగంగానే అడిగి ఉండొచ్చు. అది జరిగి కూడా దాదాపు పద్నాలుగేళ్లు అవుతోంది. ఇప్పుడు మాట్లాడాలని ఆయనకు కోరిక వచ్చి ఉంటుంది. ఎన్నికల్లో భాగంగా మా సంక్షేమం కోసం, విష్ణు గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అడిగి ఉంటారు. అడగడం మంచిదే. ఈ మాటలు ఎవరో అని ఉంటే చెప్పేవాడిని కాదు. కానీ మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి అడుగుతుండటంతో చెబుతున్నాను. ఆయన నా పేరు ఎత్తలేదు. కానీ చెబుతున్నాను. మోహన్ బాబు గారు ఇది మీ కోసమే. వినండి. చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు బిల్డింగ్ ఖాళీ చేయమని తీవ్రంగా ఒత్తిడి చేశారు. అయితే ఆ సమయంలో మా వద్ద అన్నీ కలుపుకుని దాదాపు కోటీ ఇరవై, ముప్పై లక్షలు ఉన్నాయి. అయితే పరుచూరి గోపాలకృష్ణ సలహా, సూచనలతో శ్రీనగర్ కాలనీలో డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌కు దగ్గర్లో ఓ భవనాన్ని కొన్నాం. చిన్న వాళ్లకు అందరికీ అందుబాటులోఉంటుంది.. అందరం అక్కడే ఉంటాం అని పరుచూరి గారు చెప్పడంతో అక్కడ ఓ బిల్డింగ్ కొన్నాం. 140స్క్వేర్ యార్డ్స్ స్థలంలో ఉన్న భవనాన్ని 71 లక్షలకు కొన్నాం. ఇంకో మూడు లక్షలతో రిపేర్ చేయించాం. ఇంకో పదిహేను లక్షలతో కొంత రెన్యువేట్ చేయించాం. మొత్తం 96 లక్షలు ఖర్చు అయింది. అయితే ఆ తరువాత 2017లో ఆ బిల్డింగ్‌ను శివాజీ రాజా అధ్యక్షుడిగా, నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో అమ్మేశారు. అది కూడా చాలా తక్కువ రేటుకే అమ్మేశారు. దాన్ని నడపడం భారమైందనే కారణం చెప్పారు. ఎందుకు ఎలా భారమైందో చెప్పాలి. పైగా 95లక్షలు ఎస్టిమేట్ చేసి.. 35 లక్షలకు బేరంపెట్టేశారు. 30 లక్షల తొంబై వేలకు అమ్మేశారు. దాని విలువ ఎక్కువ ఉంటుదని మా చార్టెడ్ అకౌంట్ చెప్పినా వినలేదు. అయితే ఆ ల్యాండ్ విలువే.. దాదాపు కోటీ నలబై లక్షలు ఇప్పుడు. ఆ 30లక్షలు కూడా ఏం చేశారో తెలియదు. అంత తక్కువకు బిల్డింగ్ అమ్మింది కూడా నరేష్. అంటే మీకు మద్దతుగా తిరుగుతున్న వారే. ఎందుకు కొనాల్సి వచ్చిందో నేను చెప్పాను. ఇక ఎందుకు అమ్మాల్సి వచ్చిందో ఆయన్ను చెప్పమనండి. మాకు కూడా చెప్పండి. ఇంకోసారి ఎవరైనా ఎందుకు కొన్నారు అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే చాలా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది. దయచేసి అలాంటి పరిస్థితిని తీసుకురాకండి’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ne1dG5

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts