అటు బుల్లితెర, ఇటు వెండితెర, మ్యూజిక్ వీడియోల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్‌పై నటుడు అమిత్ టాండన్ సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి ఒకప్పుడు అమిత్ టాండన్ భార్య రూబీ, మౌనీ రాయ్ చాలా మంచి స్నేహితులు. కానీ రూబీ కొన్నాళ్లు ముందు దుబాయ్‌లో అరెస్ట్ అయ్యింది. అప్పటి నుంచి రూబీ, అమిత్ టాండన్‌లతో మౌనీరాయ్కు గొడవలు మొదలయ్యాయి. మీడియాలో దీనికి సంబంధించి ఎన్ని రకాలు వార్తలు వచ్చినా ఇరు వర్గాల వాళ్లు నోళ్లు మెదపలేదు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మౌనీ రాయ్‌పై అమిత్ టాండన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రూబీతో స్నేహంగా ఉన్నప్పుడు మౌనీరాయ్ నా భార్యను ఆమె అవసరాలకు వాడుకుంది. అదే ఆమె అవసరం మాకు కావాల్సినప్పుడు మాత్రం పట్టించుకోలేదు. రూబీ తనను చాలా బాగా నమ్మింది. అయితే మౌనీరాయ్ మాత్రం అనుకున్నంత నిజాయతీపరురాలు కాదు. దుబాయ్ జైలులో రూబీ ఉన్నప్పుడు మౌనీ రాయ్ ప్రవర్తనేంటో తెలిసింది. ఆమె అలా ప్రవర్తించడంతో మా హృదయాలు గాయపడ్డాయి. ఆమె మాతో కలిసి తిరిగిన మౌనీరాయేనా అనిపించింది. తన ప్రవర్తనలో అంత మార్పు కనిపించింది. స్నేహితులు పడిపోయినప్పుడు మనం చేయి అందించాలి. నా భార్య చేసిన పనిని మౌనీ చేయలేకపోయింది. అయితేనేం, రూబీ మళ్లీ శక్తివంతంగా లేచినిలబడింది. మౌనీరాయ్ను క్షమించడం జరగదు. ఒకవేళ ఆమెతో స్నేహం చేస్తే మన బంధం తెగిపోతుందని నా భార్యతో చెప్పాను. 2017లో దుబాయ్‌కు వెళ్లిన రూబీ అక్కడ అధికారులను బెదిరించిందనే కారణంతో అరెస్ట్ అయ్యింది. 2019లో ఇండియా తిరిగొచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hKrmsG
No comments:
Post a Comment