గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం తొలి వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ఆర్బాటాలు లేకుండా నిర్వహించారు. తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని తామరపాక్కంలోని ఫామ్ హౌస్‌లో ఎస్.పి.బాలు సమాధికి ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించడానికి ఇతరులను అనుమతించలేదు. కరోనా కారణంగా ఇతరులను ఎస్.పి.బాలు సమాధి వద్దకు అనుమతించలేదని బాలు తనయుడు ఎస్.పి.చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీబీ కుమారుడు, గాయకుడు ఎస్.పి.చరణ్ మాట్లాడుతూ ‘‘నాన్నగారు లేకపోవడం తీరని టోటు. ఆయన లేరని నమ్మకలేకపోతున్నాం. స్మారక చిహ్మాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఏడాది లోపు స్మారక చిహ్మాన్ని ఏర్పాటు చేస్తాం. ఓ మ్యూజియంను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. అందుకు ప్రభుత్వం సాయం చేయాలి. అలాగే నాన్నగారి అభిమానులు కూడా తోచినంత సాయం చేయాలని కోరుకుటున్నాను. ఎస్పీబీ ప్రథమ వర్ధంతి సందర్భంగా చెన్నైలో సంగీత దర్శకులందరూ కలిసి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మాస్ట్రో ఇళయరాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీబీతో తనకు ఉన్న అనుబంధాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలు, తన కృషి వల్లనే ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయన్నారు ఇళయారాజా. మా మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. తను హాస్పిటల్లో ఉన్నప్పుడు లేచి రా! బాలు అంటూ నేను పంపిన వీడియో చూసి నన్ను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారని చరణ్ చెప్పాడని రాజా తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oczk1I
No comments:
Post a Comment