ఫేమ్ తన మాజీ ప్రియుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ సంగతులపై ఓపెన్ అవుతూ అప్పట్లో ఎదుర్కొన్న మానసిక క్షోభను వివరించారు. అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తితో బ్రేకప్ కారణంగా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. అతని వల్ల చాలా లైఫ్ థ్రెట్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. తల్లిదండ్రులను ఒప్పించి మరీ ముంబైకి వచ్చి కెరీర్ ఆరంభంలోనే అష్టకష్టాలు పడ్డానని, ఆ తర్వాత ఓ వ్యక్తితో ప్రేమలో పడి బ్రేకప్ కూడా జరిగిందని చెప్పిన అక్షర.. అతని వల్లే తన లైఫ్‌లో సమస్యలు తలెత్తాయని చెప్పారు. తాను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏ అమ్మాయికీ రాకూడదని అన్నారు. ప్రేమించిన వ్యక్తే చంపేస్తా అని బెదిరించాడంటూ ఆవేదన చెందారు. ''చంపేస్తాను, కెరీర్ నాశనం చేస్తాను అని బెదిరింపులకు దిగడమే గాక మనుషులను పెట్టించి నాపై యాసిడ్ దాడి చేయించాలని ప్లాన్ చేశాడు. ఆ సమయంలో ఎదుర్కొన్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేను. కానీ ఆ తర్వాత మా నాన్న ఇచ్చిన ధైర్యంతో మానసికంగా చాలా దృఢంగా మారాను. అవసరం లేని విషయాలు పట్టించుకోవడం మానేసి ప్రాణాలును కూడా లెక్కచేయకుండా అన్నీ ఫేస్ చేశాను. నీ గొంతు కోసేస్తా.. చంపేస్తా అన్నా కూడా దమ్ముంటే రండి అని ఎదురుపడ్డాను. అలా నాన్న ఇచ్చిన ఆ ధైర్యంతోనే ఇప్పుడు కెరీర్‌లో రాణిస్తున్నా'' అని అక్షర సింగ్ అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EeZqHa
No comments:
Post a Comment