సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీల పర్సనల్ విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. సినీ నటులు, యాంకర్స్ నెటిజన్లతో లైవ్ చాట్స్ చేస్తూ తమ వ్యక్తిగత విషయాలపై ఎంతోకొంత ఓపెన్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ సెషన్ నిర్వహించి ప్రేమ, పెళ్లి, క్రష్ గురించిన విషయాలపై రియాక్ట్ అయింది. పెద్ద యాంకర్ కాకపోయినా అరియానా పేరును తెలుగు ప్రేక్షకులు మరవలేని విధంగా చేశారు రామ్ గోపాల్ వర్మ. పలు యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఆమెకు ఆర్జీవీ ఇంటర్వ్యూ బాగా కలిసొచ్చింది. నిన్ను బికినీలో చూడాలని ఉందంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్‌తో అరియానా పేరు మారుమోగింది. అలా ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి తనదైన మాటతీరు, ఆట పాటలతో అట్రాక్ట్ చేసి ఫుల్ ఫేమస్ అయింది అరియానా. బిగ్ బాస్ హౌస్‌లో యంగ్ లేడీగా రొమాంటిక్ మూమెంట్స్‌తో కిక్కిచ్చిన ఈ బ్యూటీ.. అదే బిగ్ బాస్ కంటిస్టెంట్ అవినాష్‌తో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఒకానొక సమయంలో ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలు ఊపందుకోవడంతో తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి అరియానా ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక తాజా సెషన్‌లో అయితే అబ్బాయిలపై తన ఫీలింగ్స్ బయటపెట్టి షాకిచ్చింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? ప్రేమ వివాహం చేసుకుంటావా' అని ఓ నెటిజన్ అడగ్గా.. లవ్ మ్యారేజ్ చేసుకుంటా అనే హింట్ ఇస్తూ సెల్ఫీ వీడియోలతో సమాధానాలు చెప్పింది అరియానా. అలాగే తనకు క్రష్ అనేది ఉందని, కాకపోతే బయటకు చెప్పనని తెలిపింది. అప్పుడప్పుడు కొంతమంది అబ్బాయిలను చూస్తే.. 'అరె! భలే ఉన్నాడే ఈ అబ్బాయి' అనే ఫీలింగ్ కలుగుతుందని, మళ్ళీ ఎందుకు లేనిపోని ఇబ్బందులు అని ఆలోచించి వెంటనే మర్చిపోతానని చెబుతూ ఓపెన్‌గా మాట్లాడింది అరియానా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fouauM
No comments:
Post a Comment