ఈ రోజుల్లో సినిమా రూపొందించడం ఓ ఎత్తయితే, విడుదలకు ముందు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తవుతోంది. అందుకే సినిమా ప్రమోషన్స్ పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ మేరకు షూటింగ్ ప్రారంభం నుంచే వినూత్నంగా ఆలోచిస్తూ తమ తమ సినిమాలను జనం నోళ్ళలో నానేలా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యపాత్రలో నటించిన '' మూవీ ప్రమోషన్స్ కోసం డిఫరెంట్ ప్లాన్స్ చేశారట మేకర్స్. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న 'బ్రహ్మాస్త్ర' మూవీని హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన రోల్ చాలా డిఫరెంట్‌గా ఉండనుందట. గత రెండు మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది. కొంచెం ప్యాచ్ వర్క్ మినహా అంతా ఫినిష్ చేసేశారట. దీంతో ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చూస్తోందట బ్రహ్మాస్త్ర టీమ్. ఈ మేరకు 13 మోషన్ పోస్టర్లు, 10 టీజర్లు రెడీ చేస్తోందట చిత్ర యూనిట్. ఈ అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వదులుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా స్కెచ్చేశారట దర్శకనిర్మాతలు. సెన్సార్ బోర్డ్‌ల నుంచి అనుమతులు పొందిన వెంటనే ఈ ప్రచారం షురూ చేయనున్నారని టాక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yKdFAP
No comments:
Post a Comment