హీరోయిన్లలో కొందరు హీరోయిన్స్ తీరే వేరు. ఓపెన్ మాట్లాడుతూ ఏదైనా సరే నిర్మొహమాటంగా బయటపెడుతుంటారు కొందరు. అలాంటి ఎవరిలో ఒకరు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూతురు, హీరోయిన్ . సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతూ ఘాటు ఫోజులతో పిచ్చెక్కించడమే గాక పర్సనల్ విషయాలు పంచుకుంటూ ఉండటం అమ్మడి నైజం. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గని ఈ బ్యూటీ.. తాజాగా తన భర్తను బెడ్ రూములోకి రమ్మంటూ పెట్టిన కామెంట్ వైరల్ అవుతోంది. అనిల్ కపూర్ కూతురిగా కెమెరా ముందుకొచ్చిన సోనమ్ కపూర్.. ‘సవారియా' అనే మూవీతో సినీ ఆరంగేట్రం చేసింది. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా సక్సెస్ అయింది. ఫుల్ ఫామ్‌లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత వైవాహిక జీవితం కొనసాగిస్తూనే కెరీర్ కూడా రన్ చేస్తూ తనదైన బిహేవియర్‌తో తరుచూ వార్తల్లో నిలుస్తోంది సోనమ్. ఈ నెలలోనే సోనమ్ కపూర్- వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. అయితే తన పెళ్లి రోజు మర్చిపోయిన ఆనంద్ అహూజా.. కాస్త ఆలస్యంగా గుర్తు తెచ్చుకొని సోషల్ మీడియా వేదికగా తన భార్య సోనమ్‌కు రొమాంటిక్ మెసేజ్ పెట్టాడు. దీనిపై అంతకంటే రొమాంటిక్‌గా సోనమ్ కామెంట్ చేయడంతో ఈ మ్యాటర్ జనాల్లో హాట్ ఇష్యూ అయింది. ''మన బంధానికి ప్రతీ రోజు ఓ స్పెషల్ డే. పెళ్లి రోజున పోస్టు చేయడం మరిచిపోయాను. అందుకే ఇప్పుడు నేను ఫోటోను షేర్ చేస్తున్నాను'' అంటూ గతంలో ఆమెతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేశాడు ఆనంద్. దీనిపై రియాక్ట్ అయిన సోనమ్.. 'లవ్ యూ.. లవ్ యూ.. ముందు నువ్వు రూములోకి రా' అంటూ పబ్లిక్‌గా కామెంట్ పెట్టేసింది. దీంతో వీళ్లిద్దరి ఈ రొమాంటిక్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R1heBK
No comments:
Post a Comment