చిరంజీవితో ప్రకాష్ రాజ్ మీట్.. నా సోదరుడంటూ స్వీట్ కామెంట్! 'మా' బరిలో మెగా సపోర్ట్..?

గత కొన్ని రోజులుగా సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్‌కి సంబంధించిన ప్రతి అంశం చర్చల్లో నిలుస్తోంది. ఈ సారి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం మొదలుకొని ఆ తర్వాత నెలకొన్న పరిణామాలు, చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 'మా' అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన వెంటనే తన ప్యానల్ మెంబర్స్‌ని కూడా కన్ఫర్మ్ చేసేశారు ప్రకాష్ రాజ్. మరోవైపు సినీ వర్గాల్లో లోకల్, నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి రావడంతో పెద్ద దుమారం రేగింది. అయితే రీసెంట్‌గా ఓ మూవీ షూటింగ్ చేస్తుండగా ప్రకాష్ రాజ్ గాయపడటంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిరోజుల పాటు చికిత్స పొందిన ఆయన, స‌ర్జరీ చేయించుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత 'డెవిల్ ఈజ్ బ్యాక్' అంటూ ఓ ట్వీట్ చేసి తన ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. మా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయం అని ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఫిల్మ్ నగర్ అపోలో ఆస్పత్రి జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రకాష్ రాజ్. ఈ మేరకు చిరుతో క‌లిసి జిమ్‌లో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. "జిమ్‌లో బాస్‌ని క‌లిశాను. ఇటీవల చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిణామాలపై చర్చించాం. సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌రిష్కారాల కోసం ఆయ‌న చొర‌వ తీసుకోవ‌డం ఆనందంగా ఉంది. సోదర సమానులైన మీరు ఎప్పుడు నాకు స్పూర్తి దాయ‌కం" అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. కాగా, 'మా' అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్‌కు ఇది వరకే మెగా కుటుంబం నుంచి మద్దతు లభించిన తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఇలా చిరంజీవి- ప్రకాష్ రాజ్ మీట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yUHGO6

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts