God Father: చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న గద్దర్! వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్

మెగాస్టార్ కొత్త సినిమా ''కి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న వార్తలు సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య'తో బిజీగా ఉంటూనే మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ 'గాడ్ ఫాదర్' షురూ చేశారు మెగాస్టార్. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకొచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. చిత్రంలో నటించే నటీనటుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న డైరెక్టర్ మోహన్ రాజా.. ఫేమస్ పర్సన్స్ ‌ఈ సినిమాలో భాగమయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే గద్దర్‌ని ఓ పాత్ర కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిగాయని, రాబోయే షెడ్యూల్‌లో గద్దర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేయనున్నారని ఫిలిం నగర్ టాక్. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో ఆయన పాల్గొననున్నారట. ఆయనతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను ఈ సినిమాలో భాగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. కాగా, ప్రస్తుతం వైజాగ్‌లో జరుగాల్సిన ఈ సినిమా షూటింగ్.. సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా డేట్స్ కుదరకపోవడంతో కొద్దిరోజులు వాయిదా పడింది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ బాణీలు కడుతున్నారు. ఇకపోతే యాంకర్ అనసూయ, నయనతారలతో పాటు బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ కూడా నటిస్తున్నారని తెలుస్తుండటం.. సినిమా పట్ల మెగా అభిమానుల్లో ఉన్న ఆతృతను అమాంతం పెంచేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jpukUD

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts